విడుదల: నవంబర్ 19,2021నటీనటులు: అభినవ్ సర్ధార్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్దర్శకుడు: వెంకటేష్ త్రిపర్ణనిర్మాతలు: అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణసంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: జె. ప్రభాకర రెడ్డిఎడిటింగ్: పైడి బస్వా రెడ్డి ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కొన్ని థియేట్రికల్ రిలీజ్ కూడా అవుతున్నాయి. అలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమై థియేటర్లలోకి వచ్చిన సినిమానే ‘రామ్ అసుర్’. కొత్తవారితో రూపొందిన ఈ సినిమాకు ఎలాంటి…
మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ అనువాద చిత్రాలతో తెలుగువారి ముందుకు వచ్చినా, ‘మహానటి’తో ఇక్కడి ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్నాడు. అంతే కాదు. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నాడు. గత యేడాది అతను నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సైతం చక్కని విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ మూవీ మలయాళంతో పాటు మరో నాలుగు భాషల్లో తొలిసారి శుక్రవారం విడుదలైంది. కేరళకు చెందిన క్రిమినల్ సుకుమార కురుప్.…
‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన మూడో చిత్రం ‘పుష్పక విమానం’. విశేషం ఏమంటే ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడు కాగా, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి విజయ్ దేవరకొండ తండ్రి గోవర్థన్ రావు దీన్ని నిర్మించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన కమల్ హాసన్ సైలెంట్ మూవీ ‘పుష్పక విమానం’ పేరునే దీనికీ పెట్టడంతో సహజంగానే తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమా…
ఏపీలో ప్రధాన ఎయిర్ పోర్టులకు ధీటుగా ఇతర ఎయిర్ పోర్టుల ప్రగతిపై అధికారులు ఫోకస్ పెట్టారు. కర్నూలు ఎయిర్ పోర్ట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు అధికారులు. ఈ సమీక్షలో ఎయిర్ పోర్ట్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్వీరాన్మెంట్ మేనేజ్ మెంట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. హైజాకింగ్ మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. విమానాశ్రయంలోకి జంతువులు, పక్షులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, పొల్యూషన్…
సూపర్ హీరోస్ చిత్రాలను అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మార్వెల్ కామిక్ బుక్స్ లోని సూపర్ హీరో క్యారెక్టర్స్ ను బేస్ చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’తో కొందరు సూపర్ హీరోస్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఆ సంస్థ, ఇప్పుడు సరికొత్త సీరిస్ తో జనం ముందుకు వచ్చింది. అదే ‘ఇటర్నల్స్’. మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా శుక్రవారం జనం ముందుకు వచ్చింది. 2డీతో…
దాదాపు పదేళ్ళ క్రితం విశాల్, ఆర్య హీరోలుగా దర్శకుడు బాలా ‘అవన్ – ఇవన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నటుడిగా విశాల్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. ఇంతకాలానికి మళ్ళీ వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ శంకర్ ‘ఎనిమి’ చిత్రాన్ని రూపొందించాడు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా వచ్చిన రజనీకాంత్ ‘పెద్దన్న’తో పోటీ పడింది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పారి రాజన్ (ప్రకాశ్…
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణం బాగా పెరిగింది. అలా రూపొందిన చిత్రమే ఈ ‘మంచిరోజులు వచ్చాయి’. యువి క్రియేషన్స్ భాగస్వామి కావడం, దర్శకుడు మారుతి దర్శకత్వం వహించటంతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగి థియేటర్ రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ తరహా చిత్రాలకు సరిగ్గా సరిపోయే హీరో సంతోష్ శోభన్. ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయిన తర్వాత మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. మరి దీపావళి…
గత కొంతకాలంగా రజనీకాంత్ నుండి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏదీ రాలేదనే బాధ అతని అభిమానులకు ఉంది. ఏదో ఒక జానర్ కు ఆయన పరిమితమైపోతున్నారని, మరీ ముఖ్యంగా ‘కబాలి, కాలా, పేట, దర్బార్’ వంటి చిత్రాలతో ఒకే తరహా వర్గాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారని వారంత భావిస్తున్నారు. ఈసారి ఆ లోటును తీర్చడానికన్నట్టుగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ విత్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘పెద్దన్న’ను చేశాడు రజనీకాంత్.…
సోనీ లివ్ తెలుగు ఓటీటీని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అందులో అన్నీ వింత వింత కథా చిత్రాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. తొలి చిత్రం ‘వివాహ భోజనంబు’ తప్పితే అన్ని వర్గాలను అలరించే చిత్రమేదీ అందులో ఆ తర్వాత రాలేదు. బహుశా డిఫరెంట్ జానర్ మూవీస్ ద్వారానే తమ ఉనికిని చాటుకోవాలని ఆ సంస్థ భావిస్తోందేమో తెలియదు! లేదా అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా సోనీ లివ్ నిలవాలని భావించినా తప్పులేదు. ఎందుకంటే ఇవాళ ఆ…
ప్రముఖ దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన సినిమా ‘రొమాంటిక్’. మూడేళ్ళ క్రితం ఆకాశ్ తో పూరి స్వీయ దర్శకత్వంలో ‘మెహబూబా’ చిత్రం నిర్మించారు. అది చేదు అనుభవాన్ని ఇవ్వడంతో ఈసారి కథ, చిత్రానువాదం, సంభాషణలు మాత్రం తాను అందించి, మెగా ఫోన్ ను అనిల్ పాదూరి చేతికిచ్చారు. ‘మెహబూబా’ను నిర్మించిన పూరి, ఛార్మినే ‘రొమాంటిక్’నూ తీశారు. కరోనా కారణంగా విడుదలలో చాలానే జాప్యం జరిగి, ఎట్టకేలకు ఈ ‘రొమాంటిక్’ శుక్రవారం జనం ముందుకు…