విడుదల: నవంబర్ 19,2021
నటీనటులు: అభినవ్ సర్ధార్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్
దర్శకుడు: వెంకటేష్ త్రిపర్ణ
నిర్మాతలు: అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: జె. ప్రభాకర రెడ్డి
ఎడిటింగ్: పైడి బస్వా రెడ్డి
ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కొన్ని థియేట్రికల్ రిలీజ్ కూడా అవుతున్నాయి. అలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమై థియేటర్లలోకి వచ్చిన సినిమానే ‘రామ్ అసుర్’. కొత్తవారితో రూపొందిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.
రామ్ (రామ్ కార్తీక్) ఆర్టిఫిషియల్ డైమండ్ తయారు చేయడానికి ప్రయత్నిస్తూ విఫలం అవుతుంటాడు. ఆ ప్రయత్నంలో అతడి ప్రవర్తన నచ్చక గర్ల్ ఫ్రెండ్ (షెర్రీ అగర్వాల్) అతనికి బ్రేకప్ చెప్పేస్తుంది. దాంతో రామ్ బాగా డిస్ట్రబ్ అవుతాడు. జీవితంలో ఎలాగైనా సక్సెస్ కావాలనే పట్టుదలతో రామ్ రామాచారి అనే పూజారిని కలుస్తాడు. ఆయన సూచన మేరకు రామ్ సూరి (అభినవ్ సర్దార్)ని కలవటనికి ట్రై చేస్తాడు. అసలు ఆ సూరి ఎవరు? అతనికి రామ్ కి ఉన్న సంబంధం ఏమిటి? సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిసాయి? రామ్ డైమండ్ తయారు చేయగలుగుతాడా? ఈ విషయాలన్నింటికీ సమాధానమే ఈ ‘రామ్ అసుర్’ సినిమా.
డైమండ్ తయారు చేయటమనే కథాంశం కొత్తది. రామ్ కార్తీక్ రొమాంటిక్ బాయ్‌గా ఆకట్టుకుంటాడు. సూరిగా అభినవ్ సర్దార్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. షెర్రీ అగర్వాల్ గ్లామర్ కే పరిమితం అయింది. చాందిని తమిళరాసన్ పెర్ఫార్మెన్స్ ఓకె. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్, శివ పాత్రలో షానీ సాల్మన్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కథాంశం బాగున్నా పాత్రల పరిచయానికి ఎక్కువ టైమ్ తీసుకోవడంతో అది తేలిపోయింది. భీమ్స్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం వినసొంపుగానే ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ శాఖల్ని వెంకటేష్ త్రిపర్ణ హ్యాండిల్ చేసాడు. తొలి సినిమా అయినా ఇన్ని బాధ్యతలు మోస్తూ లిమిటెడ్ బడ్జెట్ లో మంచి ఔట్ పుట్ ఇచ్చాడనే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లో హీరో క్యారెక్టర్ కి స్టార్ హీరోల స్థాయిలో ఓవర్ బిల్డప్ ఇవ్వడం దెబ్బతీసింది. సెకండాఫ్ స్లోగా, రొటీన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
ప్లస్ పాయింట్స్
కొత్తదనం ఉన్న కథాంశం
భీమ్స్ సంగీతం
నటీనటుల పెర్ఫార్మెన్స్
మైనస్ పాయింట్స్
కథను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం
రేటింగ్ : 2.25 /5