కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దాంతో సహజంగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే దర్శకులు, నిర్మాతలు ఎక్కువయ్యారు. అయితే కొందరు తమలోని పేషన్ ను విస్త్రత పరిధిలో ప్రేక్షకులకు చేర్చాలనే భావనతో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను సైతం థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలా ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చిందే ‘ది రోజ్ విల్లా’ మూవీ. డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), అతని భార్య, రచయిత్రి శ్వేత…
నటీ నటులు: శ్వేతా పరాశర్, ప్రవీణ్ యండమూరి, యష్ పూరి, తన్వి ఆకాంక్ష, రవివర్మ, అజయ్మ్యూజిక్: సంతు ఓమ్ కార్,సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయికుమార్నిర్మాతలు: సుప్రీత్ కృష్ణ, లొక్కు శ్రీవరుణ్, రాహుల్ రెడ్డిదర్శకత్వం: సుప్రీత్.సి.కృష్ణస్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం: జీ 5 జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి సినిమా బిజినెస్ లో పండిపోయిన రాఘవేంద్రరెడ్డి తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. కొత్తవారితో తీసిన ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. రాగ్, పల్లవి, దిలీప్, యశ్…
టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగచైతన్యకు మూడు తరాల ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సాయిపల్లవి డాన్స్ కు ‘ఫిదా’ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఆర్మూర్ కు చెందిన రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో ఫిట్ నెస్ బేస్డ్ డాన్స్ ఇన్ స్టిట్యూట్…
రివ్యూ: నెట్విడుదల: సెప్టెంబర్ 10, 2021, జీ5నటీనటులు: రాహుల్ రామకృష్ణ, అవికా గోర్, ప్రణీత పట్నాయక్, విశ్వదేవ్, విష్ణునిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్రాసంగీతం: నరేశ్ కుమరన్కెమెరా: అభిరాజ్ నాయర్ఎడిటర్: రవితేజ గిరిజాలస్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం: భార్గవ్ మాచర్ల ఇటీవల కాలంలో ప్రతి మనిషి కదలికలపై మూడో కన్ను నిఘా ఎక్కువ అయింది. దీనికంతటికీ కారణం ‘నెట్’. ఈ నెట్ అతి చవకగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అలా కుటుంబాలపై నిఘా పెరిగితే ఏమవుతుందన్న…
శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన కీలక పాత్రలు పోషించిన సినిమా ‘రాజ రాజ చోర’. గురువారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. వాస్తవానికి భిన్నమైన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటాడని శ్రీవిష్ణుకు పేరుంది. అయితే అతను నటించిన ముందు చిత్రం ‘గాలి సంపత్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో ఫస్ట్ లుక్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ‘రాజ రాజ చోర’ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. మరి ఈ…
మల్లూవుడ్ లో సీనియర్ హీరోయిన్ మంజు వారియర్. ప్రముఖ నటుడు దిలీప్ ను పెళ్ళిచేసుకుని, 1998లో నటనకు దూరమైన మంజు వారియర్, అతని నుండి విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి ‘హౌ ఓల్డ్ ఆర్ యు’తో 2014లో రీఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ చిత్రం ‘లూసిఫర్’ మాతృకలో మంజు వారియర్ కీలక పాత్ర పోషించింది. అలానే ఇటీవల వచ్చిన వెంకటేశ్ ‘నారప్ప’ తమిళ మాతృక ‘అసురన్’లో…
విలక్షణ దర్శకుడు మణిరత్నం ఏది చేసినా అందులో ఏదో ఒక వైవిధ్యం చోటు చేసుకుంటుంది. జయేంద్ర పంచపకేశన్ తో కలసి మణిరత్నం నిర్మించిన వెబ్ సీరీస్ ‘నవరస’ ఆగస్టు 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. మణిరత్నం అందించిన సిరీస్ కదా, తెలుగువారికి మొదటి నుంచీ ఆసక్తి కలుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగులోనూ అనువాదమయింది ‘నవరస’. పదాలు తెలుగులోనే వినిపించినా, పాటలు మాత్రం తమిళంలోనే వినిపిస్తాయి. కంగారు పడకండి! ఈ ‘నవరస’ తొలి ఎపిసోడ్…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత జనాలు థియేటర్లకు రావడానికి ఓ పక్క భయపడుతున్నా, చిన్న సినిమాలు మాత్రం విపరీతంగా విడుదలైపోతున్నాయి. ఈ వీకెండ్ లో ఏకంగా ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీతో కలిపి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… మిగిలిన సినిమాలన్నీ ‘ఎ’, ‘యుఎ’ సర్టిఫికెట్ పొందితే, కేవలం ‘మెరిసే మెరిసే’ చిత్రమే ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె. పవన్…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అనే సందిగ్థంలో పెద్ద సినిమా నిర్మాతలు మీనమేషాలు లెక్కపెడుతుంటే, చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం… ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నట్టుగా థియేటర్ల బాట పట్టారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన చిత్రమే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. మరో విశేషమేమంటే… ఈ మూవీలోని ట్రైలర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ, విడుదలకు ముందే వివాదం చెలరేగింది. దాంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకుని దర్శకుడు వై.…
రెండేళ్ళ క్రితం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలో, విడుదలలో జాప్యం జరిగిన ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. కథ…