ఏపీలో ప్రధాన ఎయిర్ పోర్టులకు ధీటుగా ఇతర ఎయిర్ పోర్టుల ప్రగతిపై అధికారులు ఫోకస్ పెట్టారు. కర్నూలు ఎయిర్ పోర్ట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు అధికారులు. ఈ సమీక్షలో ఎయిర్ పోర్ట్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్వీరాన్మెంట్ మేనేజ్ మెంట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. హైజాకింగ్ మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
విమానాశ్రయంలోకి జంతువులు, పక్షులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికెట్ వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. రానున్న కాలంలో కర్నూలు విమానాశ్రయం ఫోకస్ పెట్టాలన్నారు.