హైదరాబాద్ గాంధీభవన్ లో 138వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు, ఇన్ఛార్జ్ల మార్పు తన పరిధిలోకి రాదన్నారు. టీకాంగ్రెస్పై త్వరలోనే స్పష్టత వస్తుందని దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ చేరుకున్నారు. గాంధీభవన్లో ఆయన పలువురు నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో పంచాయతీపై అధిష్ఠానం సీరియస్గానే నజర్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను పరిశీలకుడిగా పంపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్కు రాబోతున్నారు. అధిష్ఠానం జోక్యంతో సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది.
తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. టీపీసీసీ కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చీలిక అనేక మలుపులు తిరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్లు ఒక్కటయ్యారు.