తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసం హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు నగర్లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
తెలంగాణ రాఊంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు.
Off The Record about Hath Se Hath Jodo Yatra in Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల ప్రస్తావన మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈనెల 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ములుగు నియోజకవర్గంలోని సమ్మక్క సారలమ్మ నుండి పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు. మొదట భద్రాచలం నుంచి ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి పాదయాత్ర.. తర్వాత సమ్మక్క జాతరకు ఎందుకు షిఫ్ట్ అయింది? అనేది కూడా…
కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. కేసీఆర్ దారిలోనే వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చేస్తున్న రాజకీయ విషప్రచారంలో ఈటెల కూడా పాత్ర ధారి అన్నారు.
గవర్నర్.. సీఎం మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక మీద చూసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం విషయంలో గొడవ సరికాదని.. ప్రభుత్వం వెంటనే గవర్నర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే ని నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఈ జాతి గొప్పదనం స్మరించుకోవాల్సిన సమయం ఇది అన్నారు రేవంత్ రెడ్డి.