Minister KTR fire on Revanth Reddy: ప్రగతి భవన్ పెల్చివేయలని రేవంత్ దుర్మార్గంగా మాటలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా? రాష్ట్ర అధ్యక్షులు అలా మాట్లాడొచ్చా ? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మీ పార్టీ అధ్యక్షుడుకి మీకు శృతి ఉందా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఎవరైతే వాళ్లు ప్రగతిభవన్ లో ఉంటారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఇది తీసేయాలి అది పేల్చాలి తప్ప ఇంకేమైనా మంచి మాట్లాడతారా ? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ని బద్దలు కొడతా అని అనొచ్చా? అంటూ ప్రశ్నించారు. పేల్చేయండి అనొచ్చా? అని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ విధానం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ధరణి రద్దు చేస్తా అని.. పీసీసీ చెప్తారు.. ఇక్కడేమో.. రద్దు చేయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు. శ్రీధర్ బాబు మంచొడే …కానీ సహవాస దోషం ఏమో ? అని ఎద్దేవ చేశారు. శ్రీధర్ అన్న , భట్టి అన్న మంచోల్లు అంటూ మంత్రి మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read also: Komatireddy Venkat Reddy: టైం లేదు.. ప్రతీ గ్రామాన్ని టచ్ చేయలేము బైక్ మీద తిరుగుతా
ఆ పార్టీ నేతలు బయట అరాచకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల పార్టీ అధ్యక్షుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను … రైట్ టు ఇన్కమ్ ఆక్ట్ గా మార్చుకున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. RTI పేరు మీద అడ్డగోలుగా దందాలు చేస్తారని ఆరోపించారు. హైదరాబాదు రంగారెడ్డి భూముల పైన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఒక దఫ్తర్ నడుపుతున్నారని మంత్రి తీవ్రంగా ఆరోపణలు గుప్పించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్రంపై మంత్రి కేటీఆర్ విరుచుపడ్డారు. దుమ్ము ధూళిలో ఉండాలని ఏ దేవుడు, భక్తులు కోరుకోరని తెలిపారు. గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు మొదలు పెట్టి అమలు చేస్తోందని అన్నారు. ఆర్మీ జోన్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన స్పందించడం లేదని మండిపడ్డారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్ పెట్ వరకు స్కైవే కోసం రాష్ట్రం రెడి, కేంద్రం అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆర్మీ జోన్ ఉన్న ప్రాంతాలు నైజాం భూములని తెలిపారు. కావాలంటే పంచాయితీ పెట్టొచ్చు కానీ జవానులను గౌరవించుకునే మర్యాద రాష్ట్ర ప్రభుత్వంకు ఉందని తెలిపారు. రిలీజియన్ అడ్డంకులు ఉన్న రోడ్ల నిర్మాణం కోసం కొత్త చట్టం ఆలోచనపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Hyderabad Traffic: 10 రోజులపాటు ట్రాఫిక్ సమస్యలు.. వాహనదారులకు నరకమే