Komatireddy Venkat Reddy: టైం లేదు.. ప్రతీ గ్రామాన్ని టచ్ చేయలేమన్నారు. బైక్ మీద తిరుగుతా అని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక ప్రైవేటు హోటల్ ప్రారంభోత్సవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై హోటల్ ను ప్రారంభించారు. అనంతరం బీఆర్‌ఎస్ శ్రేణులపై మండిపడ్డారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత ఊరులో తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న గ్రామస్తులని తీవ్రంగా మండిపడ్డారు. తన సొంతంగా ప్లాంట్ చేయబోతే ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్వర్ రెడ్డి సొంత ఊరు నాగారంలో ఇప్పటికీ ఇదే సమస్య ఉందని తెలిపారు. హాథ్ సే హాత్ జోడయాత్ర ఈనెల 13న పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత చేస్తానని స్పష్టం చేశారు.
Read also: Hyderabad Traffic: 10 రోజులపాటు ట్రాఫిక్ సమస్యలు.. వాహనదారులకు నరకమే
నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి నాలుగు జిల్లాలను కలుపుకొని బస్సు యాత్ర లేదా బైక్ యాత్ర ఏదో ఒకటి చేపడతానని పేర్కొన్నారు కోమటిరెడ్డి. ఎన్నికలకు సమయం తప్పుగా ఉందన్న ఆయన 12 నియోజకవర్గాల్లో పూర్తిగా బైక్ యాత్ర త్వరలో చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 13 తరవాత నల్గొండలో బైక్ యాత్ర చేస్తానని అన్నారు. మిగిలిన నియోజక వర్గాల్లో.. బస్సు యాత్ర.. లేదంటే ఇంకోట అనేది ఆలోచించి చేస్తామన్నారు. రేవంత్ కూడా నడుస్తున్నాడు.. గ్రామాలు లేని చోటా కార్ లో వెళ్తున్నారు రేవంత్ అని తెలిపారు. అలా నేను కూడా వీలును బట్టి చేస్తానని స్పష్టం శారు. టైం లేదు.. ప్రతీ గ్రామాన్ని టచ్ చేయలేమన్నారు. బైక్ మీద తిరుగుతా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
Amit Shah: ఈ నెల 11న అమిత్ షా రాష్ట్ర పర్యటన