ఈ నెల 30న భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కశ్మీర్లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరవేస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు బయలుదేరి వెళతారని వెల్లడించారు.
Komatireddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడాది తర్వాత ఆయన గాంధీభవన్లో అడుగుపెట్టారు. శుక్రవారం గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు.
Revanth Reddy paid tribute to Mukharam Jha body: నిజాం రాజు అంతక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపించడాన్ని తప్పుపట్టే వారు మానసిక అంగవైకల్యం కలవారని భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్లో ఎనిమిదో నిజాం బర్కత్ అలీఖాన్ ముకరం ఝా బహదూర్ పార్థివదేహానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని…
సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తాజాగా హైకోర్టు అదే చెప్పిందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ట్వీట్టర్ ద్వారా ఆయన డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు.