ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు ఊరట లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కంపెనీ గోల్డ్ లోన్ వ్యాపారంపై విధించిన ఆంక్షలను ఎత్తివేసినట్లు తెలిపింది. కంపెనీ గోల్డ్ లోన్ వ్యాపారంపై విధించిన పరిమితులను ఎత్తివేసింది.
రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. ఆదేశాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాల్సిందే.. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయకపోతే.. 7 రోజుల తర్వాత, దానిపై రోజుకు 500 రూపాయల జరిమానాను వినియోగదారుడికి ఆయా బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఆగస్టు 8 వరకు జరగనుంది. ఈ సమావేశంలో రుణాన్ని చౌకగా ఇవ్వడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు. ఇది కాకుండా.. జాతీయ, రాష్ట్ర స్థాయి పండుగలలో కూడా బ్యాంకులకు హాలిడేస్ ఉంటాయి.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంపై భారతీయ రిజర్వు బ్యాంకు స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా భారత్‌లోని 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సేవల్లో స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
RBI Cancelled Bank Licence : గత కొంత కాలంగా సహకార బ్యాంకులపై సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కాస్త కఠినంగా వ్యవహరిస్తోంట్లుగా కనపడుతోంది. కొన్ని సహకార బ్యాంకులకు జరిమానా విధించడంతోపాటు పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేశారు. ఈ క్రమంలో, జూలై 4, 2024న బనారస్ మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. దీనితో పాటు 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 7 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను ఆర్బీఐ రద్దు…
దేశంలో చెలామణి నుండి తొలగించబడిన రూ. 2000 (రూ. 2000 నోటు) పింక్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. ఈ కరెన్సీ నోట్లు గత ఏడాది మే నెలలో చెలామణి నుంచి తొలగించినా.. ఇంకా ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న 100 శాతం నోట్లు తిరిగి రాలేదని తెలిపింది.