రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. ఆదేశాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. రెండు బ్యాంకులకు కలిపి రూ.2.91 కోట్లు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Russia-Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి.. 144 డ్రోన్లతో ఎటాక్
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను పాటించకపోవడం, డిపాజిట్లపై వడ్డీ, కేవైసీ, వ్యవసాయ రుణాలకు సంబంధించి మార్గదర్శకాలు పాటించకపోవడంతో యాక్సిస్ బ్యాంక్‌పై రూ.1.91 కోట్లు, డిపాజిట్లపై వడ్డీ, బ్యాంకు రికవరీ ఏజెంట్లు, బ్యాంక్ కస్టమర్ సర్వీసులకు సంబంధించి నిబంధనలు పాటించకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానా వేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
ఇది కూడా చదవండి: Hero Xtreme 160R: హీరో నుంచి ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
జరిమానాలు చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటాయని తెలిపింది. అలాగే బ్యాంకులు తమ ఖాతాదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై ఉచ్ఛరించడానికి ఉద్దేశించబడదని ఆర్‌బీఐ తెలిపింది.
ఇది కూడా చదవండి: Tata: టాటా EV కార్ కొనాలనుకుంటున్నారా, ఇదే మంచి అవకాశం.. రూ. 3 లక్షల వరకు తగ్గింపు..