Credit card: క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసుకోవాలా.. ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
- మీరు క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలనుకుంటున్నారా.. ?
- కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని అభ్యర్థిస్తే.. 7 రోజుల్లోపు అమలు చేయాలి..
- మీ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి బకాయిలు ఉండొద్దు: ఆర్బీఐ రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Credit card: ఈ రోజుల్లో చాలా మందికి ఒకటి మించి క్రెడిట్ కార్డులు ఉండటం కామన్ అయిపోయింది. బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులు ఇస్తుండటంతో అవసరం లేకున్నా కొన్ని సార్లు వాటిని తీసుకుంటుంటారు. వీటికి వార్షిక రుసుములు లేకపోతే ఇబ్బంది లేదు కానీ.. ఒక వేళ రుసుము చెల్లించాల్సి ఉంటే అవసరం లేనివాటిని క్లోజ్ చేసుకోవడం బెటర్. కాగా, ఇలాంటి క్రెడిట్ కార్డులను ఎలా క్లోజ్ చేసుకోవాలి.. ఆర్బీఐ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే.
Read Also: Elon Musk: ఎలాన్ మస్క్ కి ఎదురుదెబ్బ.. మాజీ ఉద్యోగికి రూ.5కోట్ల పరిహారం!
Also Read
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాల్సిందే.. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయకపోతే.. 7 రోజుల తర్వాత, దానిపై రోజుకు 500 రూపాయల జరిమానాను వినియోగదారుడికి ఆయా బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి బకాయిలు ఉండొద్దు.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లు జలమయం
మీరు క్రెడిట్ కార్డును ఇలా క్లోజ్ చేసుకోవచ్చు..
* ఏదైనా క్రెడిట్ కార్డ్‌ని క్లోజ్ చేసే ముందు దాని బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించాలి.. బకాయి మొత్తాన్ని చెల్లించే వరకు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేందుకు అవకాశం ఉండదు.
* క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలనే తొందరలో చాలా మంది తమ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవడం మర్చిపోతారు. కార్డ్‌ను క్లోజ్ చేసేటప్పుడు రివార్డ్ పాయింట్‌లను తప్పనిసరిగా రీడీమ్ చేసుకోండి.
* మరి కొంతమంది బీమా ప్రీమియం, ఓటీటీ నెలవారీ ఛార్జ్ లాంటి పునరావృత చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌పై స్టాండింగ్ సూచనలను పెట్టుకుంటారు. కార్డ్‌ను క్లోజ్ చేయడానికి ముందు.. దానిపై అలాంటి సూచనలేవీ లేవని నిర్థారణ చేసుకోవాలి.
* అలాగే, అన్నీ సరి చూసుకున్నాక తర్వాతే క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌ను మీరు సంప్రదించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడానికి గల కారణాన్ని అడిగితే చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ క్లోజింగ్ అభ్యర్థన బ్యాంకులు తీసుకుంటాయి. ఒకవేళ బ్యాంక్ ఈ- మెయిల్ పంపమని అడిగితే.. కత్తిరించిన కార్డ్ ఫోటోను కూడా ఈ- మెయిల్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.
* క్రెడిట్ కార్డు మూసివేసేటప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే దానిని ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రాస్‌గా కత్తిరించాలి.. అలా కాకుండా కార్డును ఎక్కడపడితే అక్కడ పడేయొద్దు.. మీ కార్డు తప్పుడు చేతుల్లోకి వెళ్తే.. దానిని దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంటుంది.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?