RBI: 86 ఏళ్ల నాటి రూ.10,000 నోటు విడుదల.. విశేషాలు ఇవే..!
- 86 ఏళ్ల నాటి 10000 నోటు విడుదల
- దాని విశేషాలు చెప్పిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10 వేల నోట్లు మీరు ఎప్పుడైనా చూశారా? ఇండియాలో 10 వేల నోట్లు ఉండేవని కనీసం పెద్దలైనా ఎప్పుడైనా గుర్తుచేశారా? ఎవరు చెప్పలేదా? ఆ ఊసే ఎప్పుడు వినబడలేదా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఏంటి? భారత్‌లో 10 వేల నోట్లు ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారా?, ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు చదువుతోంది నిజమే. దాదాపు 8 దశాబ్దాల క్రితం భారతదేశంలో 10 వేల నోట్లు చెలామణిలో ఉండేవి. నిన్నామొన్నటి వరకు భారత్‌లో రూ.1000, రూ.2000 వేల నోట్లు ఎలా ఉండేవో.. 86 ఏళ్ల క్రితం కూడా ఇండియాలో 10 వేల నోట్లు ఉండేవి. ఆ నోట్లను తాజాగా ఆర్బీఐ విడుదల చేసింది.
Also Read
- NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
- IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలో మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
- Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
- SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
1938లో చెలామణిలో ఉన్న రూ.10,000 వేల నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు ముద్రింపబడిన అదిపెద్ద డినామినేషన్ నోటు ఇదే కావడం విశేషం. అనంతరం బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు ఇది రూ.1946లో డీమోనిటైజ్ చేశారు. తిరిగి 1954లో ప్రవేశపెట్టారు. కానీ 1946 నాటి పరిస్థితులే తలెత్తడంతో తిరిగి 1978లో మరోసారి శాశ్వతంగా డీమోనిటైజేషన్ చేయబడింది.
రూ.5,000, రూ.10,000 నోట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉండేవి. సాధారణ పౌరులు ఇంత పెద్ద మొత్తాలను చాలా అరుదుగా నిర్వహించేవారు. ఈ నోట్లను ఎక్కువగా ఆర్థిక లావాదేవీల కోసం.. వ్యాపారాల కోసం వినియోగించేవారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలు అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946, జనవరిలో రద్దు చేయాలని నిర్ణయించింది. బ్రిటీష్ ప్రభుత్వం రద్దు చేసినా.. తిరిగి 1954లో ఆ రెండు నోట్లు చెలామణిలోకి వచ్చాయి. ఇక స్వతంత్రంగా భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1978లో రూ.5000, రూ.10000 వేల నోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఆర్థిక అవకతవకలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
ఆర్బీఐ ప్రకారం.. మార్చి 31, 1976 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లుగా ఉంది. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. రూ.5,000 నోట్లు రూ.22.90 కోట్లు కాగా.. రూ.10,000 నోట్ల విలువ రూ.1,260 మాత్రమే. మొత్తంగా ఈ అధిక-డినామినేషన్ నోట్లు మొత్తం కరెన్సీలో 2% కంటే తక్కువగా ఉన్నాయి.
అయితే రూ. 5,000, రూ. 10,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భావించారు. పరిశీలన కూడా జరిగింది. తిరిగి రావచ్చని సూచించారు, అయితే చివరికి ఆ ఆలోచన విరమించుకుంది. బదులుగా 2016 డిమోనిటైజేషన్ సమయంలో రూ. 500 మరియు రూ. 1,000 నోట్లను ఉపసంహరించుకున్నప్పుడు ప్రభుత్వం రూ. 2,000 నోటును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకారం.. డీమోనిటైజేషన్ వల్ల ఏర్పడిన నగదు కొరతను తగ్గించడానికి 2,000 రూపాయల నోటును త్వరగా ముద్రించి పంపిణీ చేశారు. అయితే మే 19, 2023న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!