RBI Interest Rates: కీలక వడ్డీరేట్లు యథాతథం.. 10వ సారి మార్పులు చేయని ఆర్బీఐ
- ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత్ దాస్..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు యథాతథం..
- రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Interest Rates: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సోమవారం నుంచి 3 రోజుల పాటు కొనసాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు (బుధవారం) ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తుంది. ఎలాంటి మార్పులు చేయకపోవడం ఆర్బీఐకి ఇది 10వ సారి.
Read Also: World Post Day 2024: నేడే ప్రపంచ తపాలా దినోత్సవం.. తపాలా చరిత్ర, ప్రాముఖ్యత
Also Read
అయితే, ప్రస్తుత పరిణామాల ప్రకారం రెపో రేటు తగ్గింపు డిసెంబర్ లో జరిగే సమావేశంలో ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఓటు వేసినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ వెల్లడించిన రేట్లు గుడ్ రిటర్న్ నిర్వహించిన పోల్ కి అనుకూలంగా ఉన్నాయి. అటు ద్రవ్యోల్బణంతో పాటు ఇటు వృద్ధి రేటును బ్యాలెన్స్ చేసే క్రమంలో ఈసారి కూడా రిజర్వు బ్యాంక్ తన ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణంలో నియంత్రణ నెమ్మదిగా, అసమానంగా ఉంటుందని శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు.
Read Also: Papaya: విషమే తింటున్నాం!. వాటిని తింటే క్యాన్సర్ రావడం ఖాయం.. చెక్ పెట్టండిలా..
అలాగే, ప్రభుత్వ వినియోగం మెరుగుపడుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మెుదటి త్రైమాసికంలో 8 ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి 1.8 శాతం తగ్గిందని.. FY25 మెుదటి త్రైమాసికంలో 7.2 శాతం, రెండవ త్రైమాసికంలో 7 శాతం, మూడవ త్రైమాసికంలో 7.4 శాతం, నాల్గవ త్రైమాసికంలో 7.4 శాతం వద్ద ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఇదే క్రమంలో FY 26 మెుదటి త్రైమాసికంలో వృద్ధిని 7.3 శాతం ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే, ద్రవ్యోల్బణంపై కూడా ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ.. అంతర్జాతీయంగా, దేశీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుని మూడవ త్రైమాసికంలో ఇది స్వల్పంగా పెరిగి 4.8 శాతంగా ఉండవచ్చన్నారు. ఇక, నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గి 4.2 శాతానికి చేరుకుంటుందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?