ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి సమీక్షా సమావేశానికి సిద్ధం అవుతోంది.. రేపటి నుంచి 10వ తేదీ వరకు ఈ కీలక సమావేశం జరగబోతోంది.. అయితే, ఇదే సమయంలో.. వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది.. కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేస్తోంది.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో.. వృద్ధికి మరింత మద్దతు ఇచ్చేందు.. ఆర్బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగించవచ్చు అని అంచనా వేస్తున్నారు.. రివర్స్ రెపో రేటును 0.20–0.25 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పేర్కోంది బార్‌క్లేస్..
Read Also: వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తివేత.. యథావిధిగా ఆఫీసుకు రావాల్సిందే..
కాగా, ప్రస్తుతం రివర్స్ రేపో రేటు 3.35 శాతంగా ఉంది.. కేంద్ర ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్నియూనియన్ బడ్జెట్ 2022-23లో పెంచినందున.. ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీఐ సంకేతాలు ఇస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇక, పెట్రోలియం ధరలు ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు పెరగకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు.