ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వైసీపీ ప్రభుత్వం వేలం వేసింది. వెయ్యి కోట్లు 8 సంవత్సరాల కాలానికి 7.63 శాతం వడ్డీతో వేలం వేసింది. మరో వెయ్యి కోట్లకు ఐదు సంవత్సరాల కాలానికి 7.46 శాతం వడ్డీతో బాండ్ల వేలం జరిగింది. గత వారం రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు రుణాన్ని ఏపీ ప్రభుత్వం సేకరించింది.
ఎఫ్‌ఆర్‌బిఎం కింద రూ.36 వేల కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.5 వేల కోట్లను సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణంగా జగన్ సర్కార్ సమీకరించింది. మరో 3 నెలల్లో రూ.36 వేల కోట్లు పరిమితి పూర్తయ్యే అవకాశం ఉన్న ఈ తరుణంలో మళ్లీ అప్పు చేసింది. ఏపీ ప్రభుత్వ అప్పులపై ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయ పార్టీల పొత్తుల గురించి కాదు, పెరిగి పోతున్న అప్పుల గురించి మాట్లాడాలని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్టు అప్పుల గురించి తమకు వివరాలు పంపాలని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది. ఈ నెల 31వ తేదీలోగా కార్పోరేషన్లకు గ్యారంటీలపై వివరాలు అడిగింది.
ఇదిలా వుంటే.. విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకు ప్రోత్సాహకంగా అదనపు అప్పులు చేయవచ్చని కేంద్రం వివిధ రాష్ట్రాలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏపీకి అదనంగా రూ. 3,716 కోట్లు అప్పు చేసేందుకు గత నెలలో కేంద్రం అవకాశం ఇచ్చింది. మొత్తంగా పది రాష్ట్రాలకు రూ. 28,204 కోట్లు అదనప్పు అప్పులు చేయడానికి అనుమతి ఇచ్చింది. నెలాఖరు వచ్చిందంటే నిధుల సమీకరణకు ఏపీ ప్రభుత్వం ఆపపోపాలు పడాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే కోవిడ్ సంక్షోభం ముగియడంతో పన్నుల రాబడి క్రమేపీ పెరుగుతోంది.
Tdp Support Venkayamma: వెంకాయమ్మకు టీడీపీ అండ.. వైసీపీ దాడిపై ఖండన