కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య పూర్తి సామరస్యం, సరైన అవగాహన ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్రిప్టో కరెన్సీ సహా అన్ని అంశాలపై కేంద్రం, RBI ఒకే మాటపై ఉన్నాయని చెప్పారు. ఒక వ్యవస్థ పట్ల మరో వ్యవస్థకు పరస్పర నమ్మకముందన్నారు నిర్మల. జాతీయ ప్రయోజనాలు, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ మీటింగ్ తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్ తో కలసి మీడియా ముందుకొచ్చిన నిర్మల… ప్రతీ విషయంలోనూ… కేంద్రం, RBI సామరస్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
అధికారిక డిజిటల్ కరెన్సీ విడుదల చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని RBI గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కేంద్రం, RBI మధ్య అంతర్గతంతగా డిస్కషన్ జరుగుతోందన్నారు. ఇంతకమించి విషయాలు బయటపెట్టలేమన్నారు. ఈ నెల 1న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ… రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తీసుకొస్తుందన్నారు నిర్మలా సీతారామన్. దీనికోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగిస్తామన్నారు. CBDC కోసం RBI చట్ట సవరణకు ప్రతిపాదించారు నిర్మల. మరోవైపు క్రిప్టో కరెన్సీలను వర్చువల్ ఆస్తులుగా పరిగణించి 30శాతం పన్ను వేస్తామన్నారు. దీనికోసం చట్టం తీసుకురావడంపై పని వేగంగా జరుగుతోంది.