సీఎం చంద్రబాబుతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాయచోటి జిల్లా కేంద్రం మారిన నేపథ్యంలో.. రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు. రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మండిపల్లితో సీఎం చెప్పారు. రాయచోటి అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. రాయచోటిని అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తానని మంత్రి మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు. ఈరోజు…
రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కాదు అంటే తాను చాలా బాధపడ్డాను అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోయిందని మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన పొరపాటు, గ్రహపాటుకు తాను కూడా బాధ్యడినే అంటూ.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తన ప్రతీ కన్నీటిబొట్టు రాయచోటి అభివృద్ధికే ఉపయోగపడుతుందని మంత్రి రాంప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై కన్నీరు…
Gadikota Srikanth Reddy: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేయడం, ప్రజల్లో ద్వేషాలు రేపేలా మాట్లాడడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. రాయచోటి అభివృద్ధి గురించి చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అధికారులతో కలిసి రండి. నేను ఒక్కడినే వస్తా.. గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో చూపిస్తా, అని…
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన పార్టీ నేతలు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి బైబై చెప్పేసి.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురిగింజకుంట, దప్పేపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ సర్పంచ్ లు రఘునాథ రెడ్డి, కేశవప్ప ఆధ్వర్యంలో…
రాయచోటిలో జరిగిన ఓ సంఘటన గుండెల్ని పిండేస్తోంది. కన్నతండ్రే బిడ్డల జీవితాలు నాశనమయ్యేందుకు కారణమయ్యాడు. ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకెళ్లాడా దుర్మార్గుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయచోటికి చెందిన హుస్సేన్ దినసరి కూలీ. అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతుండగానే హార్ట్ ఎటాక్ రావడంతో.. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు. దాంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం రాత్రి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నుంచి బెంగళూరుకు…
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీలను ఐబీ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో మంగళవారం జరిపిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి పట్టుబడింది. సిద్ధిక్ నివాసంలో 4 కిలోల ఆర్డీఎక్స్, డిటొనేటర్ వైర్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే వైర్లను పోలిసులు గుర్తించారు. గురువారం రాత్రి మరోసారి టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్…
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఒకపక్క రాయచోటి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలలో పోలీసులు గస్తీ కాస్తుండగా, మరోపక్క టెర్రరిస్టుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఉగ్ర కలకలం సృష్టిస్తోంది.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు.. పలు బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదునలు.. రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కన్నుమూశారు.. 80 ఏళ్ల పాలకొండరాయుడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు.. రెండు రోజుల క్రితం అనారోగ్యపాలైన సుగవాసి పాలకొండరాయుడును బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు..