రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్లోనే ధర్నాకు దిగారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల జోధ్‌పూర్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ మేనల్లుడు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘ఈరోజుల్లో పిల్లలందరూ తాగుతున్నారు. అయినా తాగితే తప్పేంటి?…
బాల్య వివాహలపై రాజస్థాన్ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అసెంబ్లీలో ఆమోదించిన ఈ చట్టాన్ని గవర్నర్ వద్దకు పంపారు. అయితే, రాష్ట్రంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణ వివాహాలతో పాటుగా…
రాజస్తాన్ లో ఎవరిపైనైనా కోపం పగ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ తరువాత పాము కాటుతో చనిపోయినట్టు చిత్రీకరిస్తూ నేరస్తులు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కోనసాగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ ధర్మాసం పేర్కొన్నది. దీనిపై ధర్మాసనం సీరియస్ అయింది. రాజస్థాన్‌లోని జుంజుహు జిల్లాలోని ఓ గ్రామంలో సుబోద్ దేవీ అనే మహిళ కుమారులిద్దరూ ఆర్మీలో పనిచేస్తున్నారు. వీరిలో పెద్ద కుమారుడు సచిన్‌కు అల్ఫాన్సా అనే యువతితో 2018 డిసెంబర్ 18…
పంజాబ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కెప్టెన్ రాజీనామా తరువాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చన్నిని ఎంపిక చేసింది. చన్నీ ప్రమాణ స్వీకారం తరువాత పీసీపీ అధ్యక్షుడు సిద్ధూ రాజీనామా చేయడం, ఆ తరువాత రాజీ కుదరడంతో తిరిగి ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవడంతో అక్కడ ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేని విధంగా ఉన్నాయి. పంజాబ్ రాజకీయాలను రాజస్థాన్, చత్తీస్గడ్ ముఖ్యమంత్రులు వెయికళ్లతో గమనిస్తున్నారు. పంజాబ్ లో జరిగినట్టుగానే రాజస్థాన్, చత్తీస్‌గడ్‌లో కూడా జరిగే…
కరోనా సమయంలో నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి పెద్ద పీఠ వేసేదిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా స్వయం సమృద్ది సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోడి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని మోడి పేర్కొన్నారు. ఈరోజు రాజస్థాన్‌లోని…
పంజాబ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రిని మార్చేశారు. గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తాయి. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందు నుంచే కెప్టెన్‌కు, సిద్ధూకు మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, సిద్ధూ చాలా కాలం క్రితం నుంచి తనను తాను సీపీపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో తన నేతృత్వంలోనే పంజాబ్ కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నాడు. దానికి తగినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం వద్ధ పావులు కదిపారు. పైగా రాహుల్‌గాంధీకి, ప్రియాంక గాంధీకి సిద్ధూకి…
ఆయనో పోలీసు ఉన్నతాధికారి.. ఓ మహిళా కానిస్టేబుల్లో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయాడు.. స్విమ్మింగ్‌పూల్‌లో అసభ్యరీతిలో, అభ్యంతరకరంగా ప్రకవర్తించాడు.. అయితే, డీఎస్పీ స్విమ్మింగ్‌పూల్ చేసిన హాట్ పనులను ఎవరూ వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో.. ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.. స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయిన డీఎస్పీ, మహిళా కానిస్టేబుల్.. సరససల్లాపాల్లో మునిగిపోయారు.. ఆ వీడియోలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది..…
రాజస్థాన్ లోని ఆరు జిల్లాల్లో మూడు దశల్లో 1564 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయితీను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 598 పంచాయతీల్లో విజయం సాధించగా, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 490 పంచాయతీల్లో విజయం సాధించింది. ఆర్ఎల్పీ 39, బీఎస్పీ 10, ఎస్సీపీ రెండు స్థానాల్లో గెలుపొందాయి. ఇక ఇండిపెండెంట్లు 250 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో గ్రామస్థాయి నుంచి పట్టు ఉందని మరోసారి నిరూపించుకుంది.…
రాజస్థాన్‌లో ఓ అద్భుతం జరిగింది. రెండుతలలో ఓ వింత గేదే జన్మించింది. రెండు తలల, నాలుగు కాళ్లు ఉన్న ఇలాంటి గేదెలు సాధారణంగా పుట్టిన కాసేపటికి మరణిస్తుంటాయి. కానీ, ఈ గేదె మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పశువైద్యులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యంతో ఉండటంతో పాటుగా ఆహారం రెండు తలలకు ఉన్న నోటి నుంచి తీసుకుంటుందని దాని యజమానులు చెబుతున్నారు. రెండు తలలతో జన్మించిన గేదె పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆహారం కూడా తీసుకుంటూ ఉండటంతో…
‘మనీ హెయిస్ట్’.. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ వున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్న సిరీస్ కూడా ఇదే కావటం విశేషం. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్లో ఐదో పార్ట్ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్ కానుంది. ఆపై డిసెంబర్లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా…