మామ అంటే తండ్రి తరువాత తండ్రిలాంటివాడు.. కుటుంబాన్ని వదిలి కొడుకు చెయ్యిపట్టుకొని వచ్చిన అమ్మాయికి మరో తండ్రిగా బాధ్యతలు తీసునేవాడే మామ. కొడుకు తప్పుచేస్తే సరిదిద్ది, కోడలు బాధల్లో ఉంటే ఓదార్చేవాడు. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక మామ మాత్రం నీచానికి ఒడిగట్టాడు. కోడలను ఇంట్లో నుంచి పంపించాడని దారుణానికి పూనుకున్నాడు.
వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అత్తమామలు, భర్తతో సంతోషంగా ఉండే ఆమె జీవితంలో విధి వంచించి భర్తను మృత్యువు తీసుకెళ్ళిపోయింది. ఎదిగిన కూతురును పెట్టుకొని బయటికి వెళ్లే దైర్యం లేక మామ గారింట్లోనే జావనం సాగిస్తోంది. భర్త చనిపోయాడు కాబట్టి కూతురును తీసుకొని బయటికి వెళ్ళాల్సిందిగా వేధించడం మొదలుపెట్టాడు. అయినా ఎంతకు ఆమె బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దీంతో కోడలిని, మనవరాలిని ఎలాగైనా ఇంట్లోనుంచి పంపించేయాలని వృద్ధుడు ప్లాన్ వేశాడు. వారు స్నానం చేసే బాత్ రూమ్ లో సీక్రెట్ గా కెమెరాలు పెట్టి వారి నగ్న వీడియోలను రికార్డు చేశాడు. ఇంట్లోనుంచి బయటకి వెళ్లకపోయితే ఈ వీడియోలను వాటిని సోషల్ మీడియాలో పెడతాను’ అంటూ ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె కంగుతింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరైంది. చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.