బాల్య వివాహలపై రాజస్థాన్ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అసెంబ్లీలో ఆమోదించిన ఈ చట్టాన్ని గవర్నర్ వద్దకు పంపారు. అయితే, రాష్ట్రంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణ వివాహాలతో పాటుగా బాల్యవివాహాలను కూడా రిజిస్టర్ చేయాలని అని చెప్పి బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు చట్టబద్దమైతే మైనర్ వివాహాలు తగ్గిపోతాయని ప్రభుత్వం ఉద్దేశం. అయితే, ఈ బిల్లు చట్టమైతే బాల్యవివాహాలను ప్రొత్సహించినట్టు అవుతుందని ప్రజాసంఘాలు, ప్రజలు నిరసనలు చేశారు. ప్రస్తుతానికి బిల్లును వెనక్కి తీసుకున్నా, బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో తాము వెనకడుగు వేయబోమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.
Read: కిమ్ సంచలన వ్యాఖ్యలు: కొరియా అస్థిరతకు కారణం అమెరికానే….