అమ్మాయి అందంగా ఉంది.. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని అనుకుని పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి, వధువు భారీ ఝలక్ ఇచ్చింది. శోభనం రోజు దగ్గరకి వెళ్తుంటే వద్దు వద్దు అంటుంటే భయపడుతుంది అనుకున్నాడు కానీ, అదంతా ఆమె ప్లాన్ అని తెలిసి ఖంగుతిన్నాడు. కేవలం నగలు, డబ్బు కోసం పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ముఠా మోసం చేసిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. పోఖ్రాన్‌లో నివాసం ఉంటున్న బాబూరామ్ అనే యువకుడికి ఇటీవలే శాంతి అనే యువతితో వివాహమయ్యింది. అమ్మాయి అందంగా ఉండడంతో ఆమె బంధువులు, ఆస్తి పాస్తులు అడగకుండా పెళ్లి చేసేసుకున్నాడు బాబూరామ్. ఇక శోభనం రోజున వధువును పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆమె వద్దు అని వారించింది. మొదటి రోజు కదా భయపడుతుందని వరుడు వదిలేశాడు. పెళ్లై వరం అవుతున్నా కూడా శాంతిలో ఎటువంటి మార్పు రాలేదు. అయితే ఎనిమిదో రోజు తన ఆరోగ్యం బాలేదని, ఒకసారి హాస్పిటల్ కి వెళ్లివస్తానని చెప్పి శాంతి బయటికి వెళ్ళింది. సాయంత్రం అవుతున్నా భార్య ఇంటికి రాకపోవడంతో అనుమానించిన భర్త ఇంట్లో డబ్బు, నగలు కనిపించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే తమకు పెళ్లి కుదిర్చిన వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫొటోల ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.