సరికొత్త ట్రెండ్: పాముకాటుతో హత్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్తాన్ లో ఎవరిపైనైనా కోపం పగ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ తరువాత పాము కాటుతో చనిపోయినట్టు చిత్రీకరిస్తూ నేరస్తులు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కోనసాగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ ధర్మాసం పేర్కొన్నది. దీనిపై ధర్మాసనం సీరియస్ అయింది. రాజస్థాన్‌లోని జుంజుహు జిల్లాలోని ఓ గ్రామంలో సుబోద్ దేవీ అనే మహిళ కుమారులిద్దరూ ఆర్మీలో పనిచేస్తున్నారు. వీరిలో పెద్ద కుమారుడు సచిన్‌కు అల్ఫాన్సా అనే యువతితో 2018 డిసెంబర్ 18 వ తేదీన వివాహం జరిగింది. ఈ వివాహం తరువాత సచిన్ తిరిగి ఆర్మీకి వెళ్లిపోయాడు. సుబోధ్ దేవీ భర్త కూడా విధుల నిమిత్తం వేరే చోటికి వెళ్లిపోవడంతో ఇంట్లో అత్త, కోడళ్లు ఇద్దరే ఉంటున్నారు. ఈ సమయంలో అల్ఫాన్సాకు జైపూర్‌కు చెందిన మనీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. విషయం అత్తకు తెలియడంతో కోడల్ని నిలదీసింది. దీంతో పథకం ప్రకారం మనీష్‌తో కలిసి పామును తీసుకొచ్చి అత్తకు కాటు వేయించారు. పాము కాటుకు మహిళ మరణించడంతో మొదట ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు కేసు వేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. పాముతో కాటు వేయించి హత్య చేస్తున్నారని, ఆ తరువాత దానిని పాము కాటుగా పేర్కొంటూ తప్పించుకుంటున్నారని, ఈ కేసులో కూడా అదే జరిగిందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Read: ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tags
- Bail
- crime
- Rajasthan
- snake
- Supreme Court
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!