Strange Baby : రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన ఆ శిశువు పుట్టిన 20నిమిషాల్లోనే మృతి చెందింది. రతన్‌గఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. హజారీ సింగ్ అనే 19 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో ఆదివారం రాత్రి గంగారామ్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు నిర్వహించిన సోనోగ్రఫీలో శిశువు వింతగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. శిశువుకు రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు రెండు వెన్నెముకలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తల మాత్రం ఒకటే ఉందని, హృదయ స్పందనలు తక్కువగా ఉండడంతో పుట్టిన 20 నిమిషాలకే నవజాత శిశువు మృతి చెందినట్టు తెలిపారు.
Read Also: Donkey Chief Guest : మహా కవి సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా ?
వింత శిశువు జననంపై డాక్టర్ రీటా సొంగరా మాట్లాడుతూ.. రతన్‌గఢ్‌లో రాజల్‌దేసర్‌లోని 3వ వార్డులో నివాసం ఉంటున్న 19 ఏళ్ల గర్భిణి హజారీ సింగ్ కు పురిటినొప్పులు రావడంతో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆస్పత్రిలో చేరింది. మహిళకు ఇతర ఆసుపత్రుల్లో చేసిన సోనోగ్రఫీ పరీక్షల్లో శిశువు సాధారణంగా ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయన్నారు. ఇంత కష్టమైన డెలివరీని నార్మల్‌గా చేయడం కష్టసాధ్యమైన పనేనని అన్నారు. అయితే, సకాలంలో సాధారణ ప్రసవం చేయడం వల్ల తల్లి ప్రాణాలు కాపాడగలిగినట్టు చెప్పారు. ఇలాంటి డెలివరీని ‘కంజుక్టివల్ అనోమలీ’ అంటారని తెలిపారు. క్రోమోజోముల వల్ల ఇలా జరుగుతుండొచ్చని డాక్టర్ అభిప్రాయపడ్డారు.