రాజస్థాన్ లోని కోటాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘటన కలకలం రేపుతుంది. మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రిలో పని చేసే 32 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగి మృతదేహం వైద్య సదుపాయంలోని టాయిలెట్‌లో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని నయాపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వ్యక్తి మృతికి గల కారణాలు తేలుస్తాయని చెప్పారు. ఈ ఘటన ఆదివారం రోజున చోటు చేసుకుంది.
Pakistan: సౌదీ యువరాజుతో పాక్ ప్రధాని భేటీ.. కాశ్మీర్‌పై చర్చ
వివరాల్లోకి వెళ్తే.. కుందన్ సోలంకి (32) అనే వ్యక్తి దోస్పురా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గత ఏడేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి కుటుంబ సభ్యులైన అతని అత్తమామలు తనను నిరంతరం బెదిరించేవారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. తన భార్యతో కోర్టు కేసులో ఉన్నాడని తెలిపారు.
Birender Singh: ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. బీరేందర్ సింగ్ రాజీనామా
ఆదివారం ఉదయం కుందన్ సోలంకి ఆసుపత్రిలో విధుల్లో ఉన్నాడని.. మధ్యాహ్నం ఓపీ సమయం ముగిసిన తర్వాత కూడా ఇంటికి రాలేదని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో.. కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారని, రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకుని చూడగా.. మరుగుదొడ్డిలో పడి ఉన్నాడని పోలీసులు తెలిపారు. వెంటనే.. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు నయాపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.