PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శల దాడిని పెంచారు. ఈ రోజు రాజస్థాన్ టోంక్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒకరు తమ మత విశ్వాసాలను అనుసరించడం కూడా కష్టంగా ఉండేదని అన్నారు. ఆ పార్టీ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అని ఆరోపించారు. దేశం మొత్తం హనుమాన్ జయంతి జరుపుకుంటున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజస్థాన్ బస్స్వారా ర్యాలీలో ‘సంపదని పంచడం’పై తాను చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ మరోసారి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్, ఇండియా కూటమికి కోపం తెప్పించాయని, వారు ప్రతీచోట నరేంద్రమోడీని విమర్శించడం ప్రారంభించారని అన్నారు.
బెంగళూర్‌లో ఇటీవల ఓ షాప్ కీపర్ హనుమాన్ చాలీసా వింటున్న క్రమంలో మరో వర్గానికి చెందిన యువకులు తీవ్రంగా కొట్టారు. దీనిని ప్రస్తావిస్తూ ప్రధాని మాట్లాడారు. ‘‘ ఒక పేదవాడు తన చిన్న దుకాణంలో హనుమాన్ చాలీసా వింటూ కూర్చున్నాడు. అతడిని రక్తం కారేలా కొట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతోంది.’’ అని అన్నారు. ‘‘అయోధ్య రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించారు కాబట్టి, వారి సహాయకులు, అనుచరులు హనుమాన్ చాలీసా వింటున్న ప్రజల్ని సులభం కొట్టవవచ్చు.’’ అని చెప్పారు.
Read Also: Kyrgyzstan: విషాదం.. జలపాతంలో పడి ఏపీ మెడికల్ విద్యార్థి మృతి
మీ సంపదను లాక్కుని ఎంపికైన వ్యక్తులకు పంచేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందనే సత్యం దేశం ముందుందని చెప్పారు. ‘‘రెండు మూడు రోజుల క్రితం, నేను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలరు, బుజ్జగింపు రాజకీయాలను బయటపెట్టాను. ఇది కాంగ్రెస్, ఇండియా కూటమిని కోపం తెప్పించింది. వారు ప్రతీ చోట ప్రధాని మోడీని దుర్వినియోగం చేయడం ప్రాంరభించారు. నిజాలకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది..?’’ అని ప్రధాని మోడీ అన్నారు. తాను చేసిన 90 సెకన్ల ప్రచారం కాంగ్రెస్‌లో భయనాన్ని పెంచిందని అన్నారు. మీ ఆస్తుల్ని లాక్కుని ప్రత్యేక వ్యక్తులకు పంచడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుందనే సత్యాన్ని చెప్పానని అన్నారు. చివకు వారు మన తల్లులు, సోదరీమణుల బంగారాన్ని, మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టబోరని నిన్న అన్నారు.
ప్రజల సంపదపై సర్వే చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసి ఉందని, సంపదపై ఎక్స్‌రే చేస్తామని కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రసంగంలో చెప్పారని, మోడీ రహస్యాన్ని బయటపెట్టడానే మీ రహస్య ఎజెండా బయటపడిందని మీరు భయపడుతున్నారని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒకరి విశ్వాసాన్ని అనుసరించడం కష్టమని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా మారిందని ఆయన అన్నారు.