PM Modi: “ఎన్నికల్లో గెలవలేని వారు..” సోనియాగాంధీపై ప్రధాని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికల్లో గెలవలేని వారు, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు.’’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న, సోనియాగాంధీ సిట్టింగ్ స్థానమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్ బరేలీని వదిలేసి, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ ఈ ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.
Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ భార్య సంచలన ఆరోపణలు.. భోజనంపై నిఘా, చంపేందుకు కుట్ర..
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ పోటీ చేస్తున్న జాలోర్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి లుంబరం చౌదరి తరుపున ప్రధాని మోడీ ఆదివారం ప్రచారం చేశారు. రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలను ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘‘రాజస్థాన్ నుంచి ఒక దక్షిణాది నేతను కాంగ్రెస్ రాజ్యసభకు పంపింది. ఆయన ఎప్పుడూ రాజస్థాన్ గురించి మాట్లాడలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కూడా రాజ్యసభకు పంపారు. మీరు ఆయనను రాజస్థాన్‌లో చూశారా..? మరి ఇప్పుడు ఎన్నికల్లో పోరాడి గెలవలేని వారిని రక్షించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చారు.’’ అని సోనియాగాంధీ పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం రాజ్యసభకు రాజస్థాన్ నుంచి ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు సోనియా గాంధీ, నీరజ్ డాంగి, రణదీప్ సింగ్ సూర్జేవాలా, KC వేణుగోపాల్, ప్రమోద్ తివారీ, ముకుల్ వాస్నిక్,. అయితే, వీరిలో డాంగీ మాత్రమే రాజస్థాన్‌కి చెందిన వారు. గత రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ని శిక్షించారని అన్నారు.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?