రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా మారుతున్న టాక్ పెరుగుతోంది లోకల్గా. ప్రత్యేకించి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికే మద్యం సిండికేట్, ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై తాజాగా భూ దందాలపై అలిగేషన్స్ రావడమే అందుకు నిదర్శనం అంటున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సమీపంలో ఉన్న గౌతమి సూపర్ బజార్కు సంబంధించిన 300 గజాలు స్థలం లీజు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో వైసిపి నేతలు ఐదు…
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో అపోహలను తొలగించేందుకు రాజమండ్రిలో చికెన్ మేళాకు అనుహ్య స్పందన లభించింది. చికెన్ వంటకాలను తినడానికి నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. చికెన్ వంటకాలను ఆరగించడానికి నాన్ వెజ్ ప్రియులు ఎగబడ్డారు. చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో ఈ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. చికెన్ 100 డిగ్రీల వేడిలో…
రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు.
Purandeswari: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి లేఖ రాశారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఎర్ర కాలువ పునరుద్ధరణకు 268.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నల్లజెర్ల, దేవరపల్లి మధ్య 6 కిలోమీటర్ల నిడివిలో కుడి, ఎడమ గట్టుల శాశ్వత పునరుద్ధరణకు రూ. 72 కోట్లు ఇవ్వాలన్నారు.
1 నుంచి 8వ తేదీ వరకు ప్రతి నెల మొదటి 8 రోజులు మోసాలకు పాల్పడి.. ఆ తరువాత సొంత వ్యాపారాలు, జల్సాలతో గడుపుతున్న ఇద్దరు అంతః రాష్ట్ర మోసగాళ్లను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. మొదటి 8 రోజులే ఎందుకంటే.. ఆ తరువాత పెన్షనర్ల వద్ద డ్రా చేసేందుకు డబ్బులుండవన్నది వీరి ఉద్దేశం. ఈ ఇద్దరూ ఏటీఎంల వద్ద కాపు కాసి నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.…
Fire Accident At Forest: రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన మంటలు భారీగా వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.
సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా హీరో వెంకటేష్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి. శ్యామల థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి... హీరో వెంకటేష్ , దర్శకుడు అనిల్ రావిపూడి యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో హీరో వెంకటేష్ కొద్దిసేపు సందడి చేశారు. హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా... 20 మంది వరకూ గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు గత రాత్రి బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బోల్తా పడింది.
అఖిరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నానని సినీనటి రేణు దేశాయ్ అన్నారు. ఓ తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా? అని ఆత్రుతగా ఉందన్నారు. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడన్నారు. గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడ చూడలేదని ఆనందోత్సాహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదని సంతోషం వెలిబుచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్…
Game Changer Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ…