Purandeswari: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి లేఖ రాశారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఎర్ర కాలువ పునరుద్ధరణకు 268.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నల్లజెర్ల, దేవరపల్లి మధ్య 6 కిలోమీటర్ల నిడివిలో కుడి, ఎడమ గట్టుల శాశ్వత పునరుద్ధరణకు రూ. 72 కోట్లు ఇవ్వాలన్నారు. దేవర పల్లి, నిడదవోలు మధ్య 6వ కిలోమీటరు నుంచి 33. 390 కిలోమీటరు వరకూ ఎడమ గట్టు శాశ్వత పునరుద్ధరణకు రూ. 114 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, తాడేపల్లి గూడెం మండలం వైపు 6వ కిలోమీటరు నుంచి 33.390 కిలోమీటరు వరకూ కుడి గట్టు శాశ్వత పునరుద్ధరణకు రూ. 82.5 కోట్లు.. ఇటీవల వరదల్లో పరిమితికి మించి పొంగడంతో జరిగిన డ్యామేజీ అని పురంధేశ్వరి వెల్లడించారు.
Read Also: Hyundai Exter: దుమ్మురేపే ఫీచర్లతో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్స్.. ధర ఎంతంటే?
ఇక, ఎర్ర కాలువ, ఎనముదురు డ్రెయిన్లు కలిపి 1.23 లక్షల క్యూసెక్కులు దాటింది అని ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి పేర్కొనింది. పక్కనే ఉన్న వ్యవసాయ భూములను కాపాడాలంటే మూడు ప్రధాన పనులు పూర్తి కావాలి అన్నారు. రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించడానికి నిధుల విడుదల అవసరం అని చెప్పారు. రైతుల సమస్యలు పూర్తిస్ధాయిలో తీరడానికి, రూ. 268.5 కోట్లు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కోరుతూ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాశారు.