రాజమండ్రిలోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో డెలివరీకి వెళ్ళిన గర్భిణి స్త్రీ అదృశ్యం కావడం కలకలం రేపింది. రాత్రి ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోయింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి మొత్తం వెతికినా.. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆందోళన చెందిన వారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన మహిళను చివరకు కాకినాడ జీజీహెచ్‌లో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణి డెలివరీ కోసం రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయింది. రాత్రి ఎవరికీ చెప్పకుండా ఆమె హాస్పిటల్ నుండి బయటికి వచ్చి.. హైటెక్ బస్టాండ్ వద్ద కాకినాడ నాన్ స్టాప్ బస్సు ఎక్కి వెళ్లిపోయింది. అనంతరం కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్‌కు సంధ్యారాణి చేరింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి మొత్తం వెతికినా.. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆందోళన చెందిన వారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంధ్యారాణి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కాకినాడ వెళ్లినట్లు పోలీసులు కనుగొన్నారు. డెలివరీ కోసం వెళ్లి కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.