రాజమండ్రి (రాజమహేంద్రవరం) ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు నేడు శంఖుస్థాపన జరగనుంది. గురువారం ఉదయం 10 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు.. ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో ఇకపై రాజమండ్రి పర్యాటక శోభను సంతరించుకోనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
అవును.. అతడు ఏటీఎంలను ఏమార్చుతాడు.. చదువురాని వాళ్లని టార్గెట్ చేస్తాడు.. ఏటీఎం నుంచి డబ్బు తీసి ఇస్తానని నమ్మించి, తర్వాత అవతలి వ్యక్తి ఏటీఎంను కొట్టేసి మరోచోట డబ్బులు నొక్కేస్తాడు. ఇలా ఒకటా రెండా.. ఏకంగా 300కు పైగా ఏటీఎం కార్డులను నొక్కేసి లక్షలాది రూపాయలు కొట్టేసాడు. అతడే విద్యాసాగర్ అనే మోసగాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దొంగతనాలకు పాల్పడినట్లు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కనుగొన్నారు. ఒక కేసులో నిందితుడిని పట్టుకొని ఆరా తీయడంతో జరిగిన…
POCSO : రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను గర్భవతి చేసి ఓ యువకుడు ముఖం చాటేశాడు. అంతేకాకుండా… కులం తక్కువ దానివంటూ దూషిస్తూ.. ఆ బాలికకు అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడు.. 2024 నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్…
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్…
టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కుటుంబం మధ్య మరోసారి రచ్చ రాజుకుంది. రాజమండ్రి సిటీ సీటు విషయంలో రెండు వర్గాల మధ్యవిభేదాలు ఎప్పటి నుంచో వివాదాలున్నాయి. 2014-19 మధ్య పీక్స్‌కు చేరిన గొడవలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళతో పాటు గడిచిన ఏడాదిగా కాస్త తగ్గాయి. కిందిస్థాయిలోని నాయకుల మధ్య అడపాదడపా గొడవలు జరుగుతున్నా... అవి పెద్ద నేతలిద్దరూ జోక్యం చేసుకునేదాకా వెళ్ళలేదు.
Butchaiah Chowdary: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు తన ఘనత అని సిటీ ఎమ్మెల్యే వాసు ప్రకటించుకోవడాన్ని గోరంట్ల తప్పుపట్టారు. 1985లోనే ఎన్టీఆర్ స్వయంగా ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు ప్రణాళికలు రచించారని, ఆ సమయంలో భూముల కేటాయింపులో తానూ కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తాను వేసిన కృషిని గుర్తు చేస్తూ, రాష్ట్ర…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టెక్నాలజీ ఆధారిత విద్యాభివృద్ధికి రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) మరియు IBM Innovation Center for Education (ICE) కలిసి “Future Forward” అనే ఇండస్ట్రీ-అలైండ్ అకడమిక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది. మే 19, 2025న జీజీయూ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ డా. యు. చంద్ర శేఖర్, ప్రో వైస్ ఛాన్స్లర్ డా. కె.…
లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న నాగాంజలి.. ఈరోజు తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వలనే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని నాగాంజలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నాగాంజలి…
లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా ప్రాణాలతో పోరాడి.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. Also Read: Pregnant Woman: ఆస్పత్రికి డెలివరీకి వెళ్లిన…