Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ–2’ పై అభిమానుల్లో నెలకొన్న భారీ హైప్‌కు మధ్య, ప్రీమియర్ షోలు రద్దు కావడంతో రాజమండ్రి కాకినాడలలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టికెట్లు తీసుకుని థియేటర్లకు వెళ్లిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. రాజమండ్రిలోని అశోక థియేటర్ వద్దకు బాలయ్య అభిమానులు ముందుగానే చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో ప్రీమియర్ షో రద్దయిందన్న సమాచారం రావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత పట్ల అసహనం…
Bus Driver Saves 50 Students:ఏకంగా 50 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి.. తనువు చాలించాడు ఓ స్కూల్ బస్సు డ్రైవర్.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సెంటర్లో ఈ రోజు ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ దెందుకూరి నారాయణరాజు (60) తన కర్తవ్య నిర్వహణలో విద్యార్థుల ప్రాణాలను కాపాడి తాను మాత్రం ప్రాణాలు…
రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. మాయమాటలతో బయటకు తీసుకువెళ్లి పదో తరగతి హాస్టల్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన అజయ్‌గా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… రాజమండ్రిలోని ఓ సాంఘిక…
Ram Gopal Varma: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది.. ఆర్జీవీతో పాటు ఓ టీవీ ఛానల్ యాంకర్‌పై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. హిందూ ఇతిహాసాలు – దేవుళ్లు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ దూషించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు. రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో…
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. తిరుపతి టూ రాజమండ్రి.. రాజమండ్రి టూ తిరుపతికి అలయన్స్ ఎయిర్ సర్వీసు ప్రారంభించనున్నది. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. వారానికి మూడు రోజులు మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. వారంలో మంగళ, గురు,శని వారాల్లో సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల 40 ని.లకు రాజమండ్రి నుండి బయలుదేరి11 గంటల 20 నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు. ఉదయం 7గంటల 40 నిమిషాలకు తిరుపతిలో…
బయట నుంచి చూస్తే అది స్పా సెంటర్.. కానీ, లోపల జరిగే తంతాంగం వేరే.. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్ లోని ఫెదర్ టచ్ స్పా అండ్ బ్యూటీ సెలూన్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనలో 12 మంది ఉండగా 11 మంది పట్టుబడ్డారు.
కాలేజీల్లో ర్యాగింగ్ భూతం ఎంత దారుణంగా ఉంటుందో మనం చూశాం. ఐతే ప్రభుత్వాలు ర్యాగింగ్ మీద దృష్టి పెట్టడంతో దాదాపు ఇప్పుడు కంట్రోల్లోనే ఉంది. కానీ విచిత్రంగా ఓ కార్పోరేట్ స్కూలులోనే ర్యాగింగ్ మళ్లీ చిగురించడం కలకలం రేపుతోంది. నిజానికి స్కూల్లో ర్యాగింగ్ చాలా తక్కువ. కానీ రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్క పడ్డారు. ఇక్కడ చూడండి.. బెడ్‌పై దీనంగా…
జకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో నారా రోహిత్.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి, సినిమాలోకి వస్తే ఎవరు ఆపారని ఎదురు ప్రశ్నించారు నారా రోహిత్... మొత్తంగా ఓ ఈవెంట్లో పవన్ కల్యాణ్ వాడిన మనల్ని ఎవడ్రా ఆపేది..? డైలాగ్‌ను గుర్తుచేసినట్టు అయ్యింది..
ఆ ఎమ్మెల్యే చెప్పేవన్నీ కబుర్లు తప్ప... చేతల్లో కనిపించడం లేదా? మాటలు కోటలు దాటుతున్నాయి గానీ... అభివృద్ధి పనులు గడప కూడా దాటడం లేదా? పైగా అనుచరులు దందాల్లో ఆరితేరిపోయి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారా? ఎమ్మెల్యేకి స్ననిహితుడైన డాక్టర్ వైద్యం మానేసి సెటిల్మెంట్స్లో బిజీగా ఉన్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ జరుగుతోందా తంతు?
సరోగసీ ద్వారా సంతానం పేరుతో మోసం చేసిన రాజమండ్రిలోని యూఎస్ ఉమెన్ కేర్, ఫెర్టిలిటీ సెంటర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఏపీలోనూ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులైన ఒక జంట తూర్పుగోదావరి జిల్లా వైద్యశాఖ అధికారులకు వాట్సాప్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లోనూ…