రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది.. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. వరుసగా రెండు రోజులపాటు సెంట్రల్ జైలు పైకి డ్రోన్ రావడంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ అప్రమత్తమై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగు సినీ నటుడు అలీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన రాజమండ్రికి చెందినవాడని, చిన్నప్పుడే సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్లి, అక్కడ సినిమా నటుడిగా మారాడని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే, అలీ పూర్వీకులది బర్మా(నేటి మయన్మార్ రాజధాని). ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిజానికి, అలీ నానమ్మ, తాత, అలీ తండ్రితో, అలాగే నానమ్మ తమ్ముడితో కలిసి సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఒక…
తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు. నిషేధిత మందులు ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. వయాగ్రా ట్యాబ్లెట్స్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు. Also Read:Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా,…
Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఆగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం బయలు దేరారు. కానీ వాతావరణం అనుకూలించక గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి ల్యాండ్ అయింది సీఎం హెలికాప్టర్. ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించేందుకు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో…
అఖండ గోదావరి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృధి చేస్తాం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజమండ్రిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందదాయకమన్నారు. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా చేస్తామన్నారు. రాజమండ్రిని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపుకు చర్యలు తీసుకుంటాం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రలు…
చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ను చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌తో రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. సుమారు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు…
రాజమండ్రి (రాజమహేంద్రవరం) ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు నేడు శంఖుస్థాపన జరగనుంది. గురువారం ఉదయం 10 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు.. ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో ఇకపై రాజమండ్రి పర్యాటక శోభను సంతరించుకోనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
అవును.. అతడు ఏటీఎంలను ఏమార్చుతాడు.. చదువురాని వాళ్లని టార్గెట్ చేస్తాడు.. ఏటీఎం నుంచి డబ్బు తీసి ఇస్తానని నమ్మించి, తర్వాత అవతలి వ్యక్తి ఏటీఎంను కొట్టేసి మరోచోట డబ్బులు నొక్కేస్తాడు. ఇలా ఒకటా రెండా.. ఏకంగా 300కు పైగా ఏటీఎం కార్డులను నొక్కేసి లక్షలాది రూపాయలు కొట్టేసాడు. అతడే విద్యాసాగర్ అనే మోసగాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దొంగతనాలకు పాల్పడినట్లు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కనుగొన్నారు. ఒక కేసులో నిందితుడిని పట్టుకొని ఆరా తీయడంతో జరిగిన…
POCSO : రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను గర్భవతి చేసి ఓ యువకుడు ముఖం చాటేశాడు. అంతేకాకుండా… కులం తక్కువ దానివంటూ దూషిస్తూ.. ఆ బాలికకు అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడు.. 2024 నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్…