ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే గేమ్ చేంజర్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉండగా సముద్రఖని, ఎస్.జె సూర్య,…
రాజమండ్రి నగరంలోని దానవాయిపేటలో ఒక బడా బిర్యాని రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యే తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులను సైతం వ్యాపారులు ఆహ్వానించారు. అయితే.. ఎమ్మెల్యే వచ్చిన సమయంలో నలుగురైదుగురు పోలీసులు రావడం, మళ్ళీ వారి కూడా వెళ్లిపోవడం సహజం. కానీ.. ఈ బిర్యానీ షాపు ప్రారంభం సందర్భంగా ఈ రోజు రూ.5 కే బిర్యాని అందిస్తున్నట్లు ఆఫర్ ప్రకటించారు. దీంతో భారీగా జనం బిర్యాని కోసం ఎగబడ్డారు. ఇంతవరకు బానే ఉన్నా..…
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్.. తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. ఇక, రన్ వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్…
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఓ ఖైదీని జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలకు గురిచేశారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారి దాడి చేయడంతో ఖైదీకి తీవ్ర రక్తస్రావం అయింది. తన నివాసంలో పనులు చేయించుకుంటున్న ఉన్నతాధికారి.. ఖైదీపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి కేంద్ర కారాగారానికి చెందిన ఓపెన్ జైలులో సుభానీ అనే వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఓపెన్ ఎయిర్ ఖైదీతో ఓ ఉన్నతాధికారి తన…
Illegal Sand Mining: రాజమండ్రిలోని కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, హేవలాక్ బ్రిడ్జిల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
Rajahmundry Road cum Rail Bridge : గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేస్తుంది. 1974 సంవత్సరంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా సేవలందిస్తుంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండవ రోడ్ కం రైల్వే బ్రిడ్జిగా చరిత్రకు ఎక్కిన. దీనిపై నిత్యం పదివేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. 60 ఏళ్లు సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జి మనుగడ మరో 20…
రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదన్న ఆమె.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి..
రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు కనిపించాయి. చిరుత పులి ప్రస్తుతం దివాన్ చెరువు అటవీప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.. చిరుతపులి కదలికలను గుర్తించు నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు ఉపయోగిస్తున్నారు.
నేటి నుండి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు అధికారులు.. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రాజమండ్రిలో మూడు రోజులుగా గణేష్ నిమజ్జనాలు నిలిచిపోయాయి. ఇక, గోదావరిలో వరద ఉధృతి తగ్గడంతో.. గణేష్ నిమజ్జనాలు కోసం పుష్కర్ ఘాట్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ర్యాంపులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.