తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసిన ఈ జిల్లాల్లో తగ్గినట్టే తగ్గి.. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. కోవిడ్ కేసులు కారణంగా రాజమండ్రి ఆదర్శనగర్‌లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు.. కోవిడ్ కేసుల కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని…
అక్కడ సైకిల్ పార్టీ గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఓ ఆఫీస్ లేదు… ఆఖరికి నగర అధ్యక్షుడు కూడా లేడు. ఇద్దరు నేతలు పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో సైకిల్ దారి తప్పుతోందట. మేయర్ ఎన్నికలో హ్యాట్రిక్ కొట్టిన చరిత్ర నుండి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందట. గతమంతా ఘనం. వర్తమానం ప్రశ్నార్థకం అన్నట్టు మారింది..రాజమండ్రిలో టిడిపి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన…
నేటి నుంచి రాజమండ్రి – కాకినాడ నాన్‌స్టాప్ సర్వీసులు పునరుద్ధరణ జరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఈ రూటులో నాన్ స్టాప్ సర్వీసులు నిలిచిపోయాయి. కాకినాడకు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 5.30కు తొలి సర్వీసు ప్రారంభం అయ్యింది. ఆఖరి సర్వీసు మధ్యాహ్నం 12.30కు బయలుదేరుతుంది. కాకినాడ డిపో నుంచి కూడా ఇదే సమయాల్లో రాజమండ్రికు నాన్‌స్టాప్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇక ప్రతి…
గ్రామాల విలీనం పూర్తయింది. డివిజన్ల ముసాయిదా విడుదలైంది. అధికార, విపక్ష పార్టీలలో ఆధిపత్యపోరుకు మాత్రం చెక్ పడలేదు. వరసగా నాలుగోసారి పాగా వేయాలని ఒక పార్టీ.. తొలిసారి జెండాను రెపరెపలాడించాలని మరొకపార్టీ కలలు కంటున్నా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. రాజమండ్రి వైసీపీ, టీడీపీ నేతల్లో ఐక్యత లేదా? గోదావరి తీరంలోని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కుతోంది. విలీన గ్రామాల సమస్య కోర్టులో ఉండటంతో మొన్న ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ముసాయిదా విడుదల కావడంతో స్పీడ్…