తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. పశ్చిమం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు అల్పపీడన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
సిక్కింలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం మధ్య భీకర కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా, కొండచరియలు విరిగిపడటంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నెల 18–21 మధ్య రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. 19వ తేదీ నుంచి రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. క్రమంగా కోస్తాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
Weather Forecast: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల,
మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయని.. ఎండలు కొద్ది కొద్దిగా తగ్గుతాయనీ ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రుతుపవనాల ఎంట్రీతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపువనాలు 48 గంటల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో వారం-10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 48 గంటల్లో కేరళలోకి రుతుపవానాలు ప్రవేశించనున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావానికి రాష్ట్రంలో మరోమారు తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
రోహిణికార్తెలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా.. పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది.