దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడిని చూపుతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. 56 రోడ్లు నీట మునిగాయి.
El Nino:వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లుగానే పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల అనేక దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
TS Rain: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు సోమవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశారు.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో తొలి రుతుపవన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. అన్ని చోట్లా పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపు నీటి కారణంగా చాలా నదులు ఉప్పొంగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రహదారులపై జామ్ ఏర్పడింది. మండి నుంచి కులు వెళ్లే రహదారిపై కొండచరియలు భయంకరంగా విరిగిపడ్డాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి.
మధ్యప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం వరకు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.