Weather In Telangana: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. పశ్చిమం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు అల్పపీడన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈరోజు ములుగు, కోట గూడెం, ఖమ్మం, జిల్లాల్లో తీవ్ర ఉరుములు, కొమరంభీం నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకచోట ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read also: Heart Attack: యువతకే హార్ట్ ఎటాక్ ఎక్కువగా వచ్చే ఛాన్స్..
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా తీవ్ర వడగళ్ల వానలు కురిశాయి. ఆదిలాబాద్, హన్మకొండ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన పరిస్థితులు నెలకొన్నాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమం నుంచి గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది’’ అని వాతావరణ బులెటిన్ పేర్కొంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 39.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు. గాలిలో తేమ శాతం నమోదైంది. నిన్న భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. దీంతో కొత్తగూడెం మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు రోడ్డు మధ్యలో భారీ ఫ్లెక్సీలు, చెట్లు పడిపోయాయి. చెట్లు పడిపోవడంతో మెయిన్ లైన్ విద్యుత్ వైర్లు తెగిపోయి పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాడింది.
Nitin Gadkari: కాంగ్రెస్‌లో చేరే బదులు బావిలో దూకుతా..