ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ గ్రౌండ్ లో వర్షపు నీరు ఎక్కువగా నిలవడంతో గ్రౌండ్ సిబ్బంది హెయిర్ డ్రయ్యర్లు, స్పాంజీలు ఉపయోగించారు. పేరుకేమో ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు.. కానీ పరిస్థితేమో ఇలా ఉంది అంటూ నెటిజన్లు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. నైరుతి రుతుపవనాలు తదుపరి 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ…
సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు.. ఆ తర్వాత వాటిని మిల్లులకు తీసుకెళ్లడం లేదు.. లారీల కొరత వల్లే ఈ సమస్య తలెత్తింది. దీంతో తమ పంటను అమ్ముకున్నా.. కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొందని రైతులు బాధపడుతున్నారు.
Rains: వేసవి కాలంలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో నమోదు అయ్యే వర్షాల కన్నా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అయినట్లు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. మార్చి 1 నుంచి మే 3 వరకు సాధారణం కన్నా 28 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయిందని తెలిపింది.
కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.. నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఆయన.. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు.. మిగతా జిల్లాల్లో…