Papikondalu Tour Cancel: వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో వానలు కురుస్తున్నాయి.. వడగాలులు వీయాల్సిన వేళ.. ఈదురుగాలులు వణికిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది.. ఇప్పటికే పలుమార్లు.. పాపికొండల టూర్ వాయిదా పడగా.. ఇప్పుడు మరోమారు బ్రేక్ పడింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ…
Rains and Thunderstorms: అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.. అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.. ఇక, ఈ రోజు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రకటించారు.. విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు..…
Rains In Hyderabad: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో నగరమంతా అస్తవ్యస్తంగా మారింది.
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే వర్షం మొదలైంది. జంట నగరాలు భారీ వర్షానికి తడిచి ముద్దైంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది.
శ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుల కారణంగా కనీసం 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయిన వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వాతావరణం మారింది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసాయి.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి లేఖ రాశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మార్చిలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న ఆయన.. మరోవైపు.. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చేతికొచ్చే పంట నేలపాలైంది.. కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో భారీగా వరిపంట…