Heavy Rains: సిక్కింలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం మధ్య భీకర కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా, కొండచరియలు విరిగిపడటంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3500 మంది పర్యాటకులు సంఘటనా స్థలంలో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా చుంగ్తాంగ్ సమీపంలోని రహదారి కొట్టుకుపోయింది. ఉత్తర సిక్కింలో 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. పర్యాటకులను రక్షించడానికి, బీఆర్వో ప్రాజెక్ట్ స్వస్తిక్ ప్రభావిత ప్రాంతం వద్ద తాత్కాలిక క్రాసింగ్‌ను నిర్మించడానికి రాత్రంతా పనిచేశారు.
Also Read: Money Missing: ప్రింట్ అయ్యాయి కానీ.. ఆర్బీఐకి చేరలేదు.. రూ.88వేల కోట్లు మిస్సింగ్.. !
శనివారం మధ్యాహ్నం 2000 మంది పర్యాటకులను సురక్షితంగా తరలించారు. త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది రాత్రంతా పనిచేసి, పర్యాటకుల రక్షణ, సౌకర్యార్థం ఫ్లాష్ వరద ప్రాంతంపై తాత్కాలిక క్రాసింగ్‌ను నిర్మించారు. పర్యాటకులు నదిని దాటడానికి సహాయం చేసారు. ఆహారం, గుడారాలు, వైద్య సహాయం అందించారు. శనివారం మధ్యాహ్నం వరకు మరో 1500 మంది పర్యాటకులను రక్షించేందుకు తరలిస్తున్నట్లు పీఆర్వో మహేంద్ర రావత్ తెలిపారు. రోడ్డు కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, కొండచరియలు విరిగిపడినా రెండు బస్సుల ద్వారా ఇప్పటివరకు మొత్తం 72 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సిక్కిం పోలీసులు తెలిపారు. 19 మంది పురుషులు, 15 మంది మహిళలు, 4 మంది చిన్నారులతో గ్యాంగ్‌టక్‌కు వెళ్తున్న తొలి బస్సుపై మంగన్ జిల్లాలోని పెగాంగ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
Also Read: Fake Certificates: పెళ్లికి ఒప్పుకోని యువతి.. నకిలీ వివాహ ధృవీకరణ పత్రాలతో వేధింపులు..!
డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ప్రకారం.. కొండచరియలు విరిగిపడటంతో సింగ్టామ్, డిక్చు, రంగ్రాన్, మంగన్, చుంగ్తాంగ్‌లను కలిపే రహదారి తీవ్రంగా దెబ్బతింది. రక్‌దుంగ్-టింటెక్ మార్గం ద్వారా డిక్చు నుంచి గ్యాంగ్‌టక్ మార్గం తేలికపాటి వాహనాలకు మాత్రమే తెరవబడుతుంది. రోడ్డు కనెక్టివిటీ పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు మే 20, 2023న ఉత్తర సిక్కింలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని తెలిసిందే. దీని తరువాత, 500 మంది పర్యాటకులను భారత సైన్యం సైనికులు రక్షించారు. ఇందులో 113 మంది మహిళలు, 54 మంది చిన్నారులు కూడా ఉన్నారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతిన్నాయని ఒక అధికారి తెలిపారు.