కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన…
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. #MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పింది. శుక్రవారం చిన్మయి తన వరుస ట్వీట్లలో లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు. Read Also…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు పార్టీ సీనియర్ నాయకుల బుజ్జగించి ఆయన రాజీనామా చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మరోసారి పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని, పార్టీకి చెందినవారే తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, అనుమానాలు నివృత్తి చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో…
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై స్పందించారు జగ్గారెడ్డి. మహారాష్ట్ర సీఎం తో కలవడం ముఖ్యమైన అంశమే. మహారాష్ట్ర సీఎం..కాంగ్రెస్ తోనే ఉన్నారు కదా..? బీజేపీ తో బాగా సంబంధం ఉంది అనే ప్రచారం నుండి బయట పడాలని కేసీఆర్ ఎత్తుగడ. బీజేపీ ముద్ర నుండి బయట పడే పనిలో కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారు. రైతు ఉద్యమనాయకుడు తికాయత్ కూడా కేసీఆర్ బీజేపీ మనిషి అని చెప్పా. దాని నుండి బయట పడేందుకు కేసీఆర్ పర్యటనల్లో బిజీగా…
తెలంగాణలో హాట్ టాపిక్ మారింది కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం. పార్టీనుంచి త్వరలో బయటకు వస్తానన్నారు జగ్గారెడ్డి. ఆటోలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీల అప్పాయింట్ మెంట్ ఇప్పిస్తే వాళ్ళకే నా ఆవేదన చెప్తా. ఠాగూర్..కేసీ వేణుగోపాల్ దగ్గర పరిష్కారం దొరకదన్నారు. అప్పాయింట్ మెంట్ ఇప్పించకపోతే 15 రోజుల తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తానన్నారు. గాంధీ భవన్ లో ఒకరిద్దరు పోతే పోనీ అనే కామెంట్స్…
ఉత్తరప్రదేశ్‌లో శాంతి, ప్రగతి కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరప్రదేశ్ ప్రజలను కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త భవిష్యత్తు ఏర్పడుతుందని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. “ఓటింగ్ ఉత్తరప్రదేశ్‌లో ఉంటుంది. దేశమంతటా మార్పు వస్తుంది! శాంతి, ప్రగతి కోసం ఓటు వేయండి – కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త భవిష్యత్తు ఏర్పడుతుంది’ అని ట్వీట్ చేశారు.ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు 59 నియోజకవర్గాల్లో…
ప్రచారం జరుగుతున్నట్టుగానే టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఆయన.. ఇక, ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేను అని పేర్కొన్నారు.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని పేర్కొన్న జగ్గారెడ్డి… త్వరలోనే…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకూ చేరింది. మహిళా కమిషన్ ని కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న మూర్ఖుడు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ అన్నారు గీతారెడ్డి. రాహుల్ గాంధీ పై చేసిన కామెంట్స్ సభ్య సమాజం…
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై ఫిర్యాదు చేసినప్పటికీ తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్,…
పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు.. చాలా సార్లు బహిర్గతం అయ్యాయి.. మాజీ సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ మధ్య వివాదాల నేపథ్యంలో.. చివరకు అమరీందర్ సింగ్ సీఎం పదవి పోయింది.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. అయితే, ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. అప్పటి పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఫతేఘర్ సాహిబ్‌లో పర్యటించిన ఆయన…