CLP Leader Mallu Bhatti Vikramarka Clarify About Party Senior Leaders Meeting. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో పార్టీ సీనియర్ల సమావేశం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సమావేశంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచామన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అని చర్చించామన్నారు. ప్రధాని…
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కని విని ఎరుగని ఘోర పరాజయం చవిచూసింది. అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోవటం హస్తం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ ఘోర ఓటమి పార్టీలో తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. కొంత కాలంగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు ఇది నైతిక బలం ఇస్తుందనటంలో సందేహం లేదు. తాజా ఎన్నికల పరాభవానికి కారణాలు, పరిస్థితులపై పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా సమావేశమైంది.…
కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఓటములు తప్పడంలేదు.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని ఖంగుతినిపించాయి.. ఐదుకు ఐదు రాష్ట్రాల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది.. మరోవైపు జీ23 నేతల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామా చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామాలు…
CWC Meeting Tomorrow at Delhi. దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఫలితాల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. మిగిలిన 4 రాష్ట్రాల విషయాన్ని పక్కనపెడితే.. తన పాలనలో ఉన్న పంజాబ్‌లో సైతం ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది.. పంజాబ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వలేని పరిస్థితి.. దిగ్గజాలు సైతం ఓటమిపాలయ్యారు. ఇక, మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా.. కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కర్ణాటకకు చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాను వెంటనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలో…
Is the Congress party disappearing in the country? దశాబ్దాల పాటు దేశాన్ని ఎదురులేకుండా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. నిజానికి చాలా రోజుల నుంచి అది ఐసీయూ లోనే ఉంది. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఎదురైన ఘోర పరాభవం దేశంలో ఇక కాంగ్రెస్‌కు చోటు లేదా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ఫలితాలు 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ మనుగడనే…
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన…
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. #MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పింది. శుక్రవారం చిన్మయి తన వరుస ట్వీట్లలో లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు. Read Also…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు పార్టీ సీనియర్ నాయకుల బుజ్జగించి ఆయన రాజీనామా చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మరోసారి పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని, పార్టీకి చెందినవారే తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, అనుమానాలు నివృత్తి చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో…
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై స్పందించారు జగ్గారెడ్డి. మహారాష్ట్ర సీఎం తో కలవడం ముఖ్యమైన అంశమే. మహారాష్ట్ర సీఎం..కాంగ్రెస్ తోనే ఉన్నారు కదా..? బీజేపీ తో బాగా సంబంధం ఉంది అనే ప్రచారం నుండి బయట పడాలని కేసీఆర్ ఎత్తుగడ. బీజేపీ ముద్ర నుండి బయట పడే పనిలో కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారు. రైతు ఉద్యమనాయకుడు తికాయత్ కూడా కేసీఆర్ బీజేపీ మనిషి అని చెప్పా. దాని నుండి బయట పడేందుకు కేసీఆర్ పర్యటనల్లో బిజీగా…