కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటించనున్నారు.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరుగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు వరంగల్ పోలీసులు.. 6వ తేదీన రాహుల్ వరంగల్‌లో పర్యటించనుండగా.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరగనున్న భారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు.. ఈ నేపథ్యంలో పలు కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. వాటిని ఫాలో కావాల్సిందిగా సూచించారు పోలీసులు. 06న (శుక్రవారం)మధ్యాహ్నం 2 గంటల నుండి హన్మకొండ కాళోజీ జంక్షన్ నుండి కాజిపేట వైపుకు ఎలాంటి భారీ వాహనాలు అనుమతించబడవు.. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు వరంగల్ పోలీస్ కమిషనర్.
ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు:
* హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే వాహనాలు పెద్దపెండ్యాల ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఉనికిచెర్ల, వడ్డేపల్లి చర్చి, ఎన్జీవోస్ కాలనీ మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది.
* బహిరంగ సభకు హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు ఫాతిమా (మదర్ థెరిస్సా) జంక్షన్ వద్ద ప్రజలను దించి తిరిగి మడికొండ వైపుగా ఈనాడు ఆఫీసు ఎదురుగావున్న పార్కింగ్ స్థలంలో తమ వాహనాలు నిలుపుకోవాలి.
* ఖమ్మం, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలు నాయుడు పెట్రోల్ పంప్, ఉర్సుగుట్ట, హంటర్ రోడ్డు మీదుగా నీలిమ జంక్షన్ (విష్ణుప్రియ గార్డెన్స్) వద్ద ప్రజలను దించి ప్రకాశ్ రెడ్డిపేట పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలపాలి. అక్కడ పార్కింగ్ పూర్తయితే WIMS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలి.
* ములుగు, భూపాలపల్లి ప్రాంతాల నుండి సభకు వచ్చే వాహనాల ప్రజలను కాళోజీ సెంటర్‌లో దించి హయగ్రీవాచారి కాంపౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలి.. అక్కడ పార్కింగ్ పూర్తయితే ములుగురోడ్డు వద్ద ఎల్బీ కాలేజీ ఆవరణలో వాహనాలు నిలుపుకోవాలి.
* కరీంనగర్ వైపునుండి వచ్చే వాహనాలు కాళోజీ సెంటర్‌లో ప్రజలను దించి KUC SVS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలి.
* వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అంబేద్కర్ జంక్షన్, ఎన్జీవోస్ కాలనీ, వడ్డేపల్లి చర్చ్ మీదుగా మదర్ థెరిస్సా జంక్షన్ వైపు ప్రయాణించి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. లేదా కరీంనగర్ రోడ్, కేయూసీ, చింతగట్టు వద్ద ఔటరింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలి.