కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఇది రాజకీయ దుమారానికి తెరతీసింది.. అదేస్థాయిలో కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. అయితే, ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా రాహుల్ గాంధీ వీడియో వైరల్ అవుతోంది.. పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్ముంటే, మొనగాడు అయితే రాహుల్ గాంధీతో డ్రగ్స్ టెస్ట్ కోసం వెంట్రుకలు ఇప్పించాలని… వరంగల్ సభలో రాహుల్ గాంధీ దీనిపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Sabitha Indra Reddy: విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయండి..
రేవంత్ రెడ్డి చెప్పినట్టు చైనా రాయబారితో తనకు నైట్ క్లబ్‌లో ఏం పనో రాహుల్ చెప్పాలన్న గువ్వల బాలరాజు.. రాహుల్ గురించి తెలుసుకోకుండా రేవంత్.. మంత్రి కేటీఆర్‌పై అనుచితంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ దేశ ద్రోహో కాదో తానే నిరూపించుకోవాలని సూచించిన ఆయన.. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాహుల్ పై దేశ రహస్యాలు శత్రు దేశానికి చేరవేసిన కేసు పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గువ్వల బాలరాజు.. రాహుల్ శైలి అనుమానాస్పదంగా ఉంది.. విచారణ జరగాల్సి ఉందన్న ఆయన.. వరంగల్ సభలో రాహుల్ అన్నింటి పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైనా అంబాసిడర్ తో రాహుల్ ఉన్నది నిజమే అని రేవంత్ అంటున్నారు.. కాదు, అని కాంగ్రెస్ వేరే నేతలు అంటున్నారు.. రేవంత్ ది అబద్ధమైతే పీసీసీ అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు గువ్వల బాలరాజు.