Vemula Prashanth Reddy: ఏ మొహం పెట్టుకొని రైతు సభ నిర్వహిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రైతు సంఘర్షణ యాత్రకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని వరంగల్‌లో ఈ సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పదేళ్ళ పాలనలో ఉన్నప్పటికీ, రాష్ట్రానికి పెద్దగా చేసిందేమీ లేదని ఆరోపించారు. అప్పుడు వ్యవసాయానికి మూడు విడతల్లో ఏడు గంటల కరెంట్ ఇచ్చారని, విత్తనాలు ఎరువుల కోసం చెప్పులు పెట్టి మరీ లైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
కానీ, ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళను పారిస్తున్నామన్నారు. 24 గంటల కరెంటు, కాళేశ్వరంతో సాగు నీళ్ళిచ్చి.. వ్యవసాయాన్ని నిలబెట్టామన్నారు. ఏడేళ్లలో 70 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు. తెలంగాణ వడ్లు కొనాలని కేంద్రమంత్రిని కోరితే.. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఆశతో రైతులు ఓటేస్తే ఒకరు మోసం చేశారు, అతనికి కచ్ఛితంగా రైతుల ఉసురు, శాపం తగులుతుందని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
Also Read
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!