Minister Harish Rao: రాహుల్ ఎందుకొస్తున్నావ్.. ఏం చెప్పడానికి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ.. తెలంగాణ పర్యటనపై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి హరీష్‌రావు.. పెద్దపల్లిలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రాహుల్ ఎందుకోసం వస్తున్నావ్..? ఏం చెప్పడానికి వస్తున్నావ్..? మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్ ది అని మండిపడ్డ ఆయన.. అధికారం కోసం ఎంత నీచమైన స్థాయికైనా దిగజారే పరిస్థితి వారిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Nara Lokesh: సీఎం జగన్‌కు లోకేష్ ‘మాస్’ లేఖ
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రావొద్దని అడ్డం పడ్డ ద్రోహి చంద్రబాబుతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా..? అని ప్రశ్నించారు హరీష్‌రావు. అధికారం కోసం ఆత్మాభిమానం మంట గలిపెస్తారు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాది బతుకు దెరువు కోసం ఆరాటం.. వాళ్లది కుర్చీల కోసం కొట్లాట అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి వస్తున్నావు రాహుల్ గాంధీ అని నిలదీశారు.. ఇక, రాహుల్ ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతు అని సెటైర్లు వేశారు. ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా అయ్యిందని విమర్శించారు.
మరోవైపు, మిస్టర్ బండి సంజయ్.. కేంద్రం లో ఉన్న 15.62 లక్షల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పండి అని సవాల్ చేశారు హరీష్‌రావు.. తాజాగా 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే వారి నోటి నుంచి మాట రావడం లేదన్నారు. కాంగ్రెస్ అంటే విత్తనాల కొరత, కరెంట్ కోతలు, ఎరువుల కొరత.. రైతుల కష్టాలు, కన్నీళ్లు.. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ నీళ్ళు రాక పంటలు ఎండి పోయేవి అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అయినా తెలంగాణలో ఇస్తున్నట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కానే కాదు అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ముడున్నరెళ్ళలో పూర్తి చేశామన్నారు. ఒకప్పుడు నీళ్ళ కోసం ధర్నాలు.. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి ఆపండి అంటున్నారన్నారు హరీష్‌రావు.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!