1. నేడు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.
2. ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,456 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 9.14 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
3. నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో 1,443 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
4. నేడు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ఏర్పాటు చేసి రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొంటారు.
5. నేడు కృష్ణానదీ యాజమాన్యం బోర్డు సమావేశం కానుంది. శ్రీశైలం, సాగర్‌లలో 15 ఔట్‌లేట్లను బోర్డుకు అప్పగింతపై చర్చించనున్నారు.
6. నేడు ముంబై వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది.