ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రైతుల సంఘర్షణ సభలో ఆయన రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే… రాహుల్ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే… పార్టీపైన ఆసంతృప్తితోనే రాజ్‌గోపాల్‌రెడ్డి సభకు హజరుకావద్దని నిర్ణయించున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాహుల్ సభ సన్నాహాక సమావేశాల్లో కూడా ఎక్కడా ఆయన కనిపించలేదు. అంతేకాకుండా రాహుల్ సభ ఏర్పాట్లకు కూడా దూరంగా ఉన్నారు.
సీఎల్పీ పదవి ఆశించిన రాజ్‌గోపాల్ రెడ్డి.. పదవి దక్కకపోవడంతో.. అసంతృప్తి చెందారు. అయితే రాజ్‌గోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీ అనుకూల వ్యాఖ్యాలు చేయడంతో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు.. రాహుల్ సభకు కూడా దూరంగా ఉండడంతో.. రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారనే నమ్మకాలు బలపడుతున్నాయి. మరోవైపు రాజ్‌గోపాల్‌రెడ్డి అన్న.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం రాహుల్ సభ ఏర్పాట్లలో చురుకుగా పాల్గొంటున్నారు.