తెలంగాణలో రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అయితే రాహుల్ చంచల్ గూడ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. చంచల్ గూడ్ జైలులో ఉన్న ఎన్ఎస్యూ నేతలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతో పాటు మరోక్కరికి మాత్రమే ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు జైళ్ల శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ అధికారికంగా ధ్రువీకరించారు. Read Also: Chandrababu: ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు.. హోటల్ తాజృష్ణాలో బస…
కొత్త థియేటర్లో పాత సినిమా లాగా కాంగ్రెస్ సభ ఉందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఆ సభ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. చావు నోట్లో తలపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బైండోవర్ కేసులు పెట్టి నిర్బంధించారని బాల్క సుమన్ పేర్కొన్నారు. పండుగలు కూడా చేసుకోలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. Read Also: Minister Niranjan Reddy: టీఆర్ఎస్ను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరు..? చంద్రబాబుకు ఏజెంట్‌గా…
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్‌పై టీఆర్ఎస్ నేత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని రాహుల్‌గాంధీని మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీ డిక్లరేషన్ పై మంత్రి మీడియాతో మాట్లాడారు. తెరాసను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరని…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర నాయకత్వం పై డైరెక్ట్ అటాక్ చేశారు. తాను లోలోపల రగిలిపోతున్న అంశాలన్నింటిపైన ఒక్క సారిగా కుండబద్దు కొట్టినట్టు చెప్పేశారు. వరంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభనే ఇందుకు వేదికగా చేసుకున్నారు ఆయన. సభకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రవర్తిస్తున్న తీరును, పార్టీ సీనియర్లుగా…
వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరుతో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరుకి రణనినాదం చేసింది తెలంగాణ కాంగ్రెస్. 2023లో రాబోయే ఎన్నికలకు నాందిగా సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ. బ్రిటీషు బానిస సంకెళ్ల విముక్తి నుండి స్వాతంత్ర్య భారత నిర్మాణానికి పునాది రాయి వేసే వరకు… భిన్నత్వంలో ఏకత్వంగా జాతిని ఐక్యం చేయడం నుండి నవ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక భారతావని నిర్మాణం వరకు… ఈ దేశ గమనంలో, గమ్యంలో కాంగ్రెస్…
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా సెటైర్స్ వేశారు. ‘‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’’ అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు. అంతేకాదు, ఆ డైలాగ్‌కి తగ్గ ఉన్న మేనరిజం ఫోటోను కూడా షేర్ చేశారు. అయితే, ఆ వెంటనే రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కౌంటర్ వేశారు. ‘‘కేటీఆర్ గారు.. మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్…
ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న సమయంలో పార్టీలు పొత్తు పెట్టుకోవడం సహజం. ఇది రాజకీయ తంత్రం.. ఎప్పుడు, ఎలాంటి మలుపులు వెలుగుచూస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈరోజు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్న వాళ్ళే రేపు చేతులు కలపొచ్చు. ఇలాంటి సందర్భాల్ని గతంలో ఎన్నో చూశాం. ఈ క్రమంలోనే తెలంగాణలో పొత్తు చర్చలు మొదలయ్యాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. రైతు సంఘర్షణ సభలో ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. కాంగ్రెస్…
వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరిట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి సంబంధించిన వివరాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీకి వివరించారు. రేవంత్ మాటల్లో వారి దైన్య పరిస్థితిని విన్న రాహుల్ అనంతరం సభా వేదిక దిశగా కదిలారు. ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎదురురావడంతో రాహుల్ చిరునవ్వు నవ్వారు.…
వరంగల్‌లోని కాంగ్రెస్ చేపట్టిన రైతు సంఘర్షణ సభలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల రాలేదని, ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇది తెలంగాణ ప్రజల స్పప్నమన్నారు. కానీ, తెలంగాణ వల్ల బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనన్నారు. మీ అందరి కల నెరవేర్చడానికి అనేకమంది రక్తం చిందించారని, కాంగ్రెస్ పోరాటం కొనసాగించిందని, సోనియాగాంధీ చొరవ వల్ల తెలంగాణ ఏర్పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్ ఘడ్లో రైతులు రుణమాఫీ…
వరంగల్‌లో రైతు సంఘర్షణ సభలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతు సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. తాము ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. అటు రైతు కూలీలకు ఏడాదికి…